ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మళ్లీ మణుగూరు ప్యాసింజర్‌ నడపాలి

ABN, Publish Date - May 08 , 2024 | 12:13 AM

తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మణుగూరు నుంచి కాజీపేటకు నడిచే మణుగూరు ప్యాసింజర్‌ రైలు గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు అనుకూలంగా ఉండేది...

తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మణుగూరు నుంచి కాజీపేటకు నడిచే మణుగూరు ప్యాసింజర్‌ రైలు గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు అనుకూలంగా ఉండేది. కరోనా వైరస్ ప్రారంభం కాకముందు నడిచిన ఈ రైలును తిరిగి ప్రయాణికుల సౌకర్యార్థం పునః ప్రారంభించాలని రైల్వే అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రైలు మణుగూరు, కొత్తగూడెం, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ, వరంగల్, కాజీపేట స్టేషన్ల నుంచి ప్రయాణించే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సమానంగా ప్యాసింజర్ రైళ్లకు కూడా ప్రయాణ చార్జీలను పెంచారు. మణుగూరు ప్యాసింజర్‌ రైలు ప్రయాణ చార్జీలను కూడా గతంలో ఉన్నట్లుగానే తగ్గించాలి.

ఈదునూరి వెంకటేశ్వర్లు

నెక్కొండ

Updated Date - May 08 , 2024 | 12:13 AM

Advertising
Advertising