ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సినిమా తీయగలిగే నవలలేవీ?

ABN, Publish Date - Jul 29 , 2024 | 02:26 AM

మలయాళం హిట్‌ సినిమాలు ‘జల్లికట్టు’, ‘ఆడు జీవితం’ నుంచి తమిళంలో ‘అసురన్‌’, ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సినిమాల దాకా పుస్తకాల నుంచి అడాప్ట్‌ చేసుకున్నవే. ఒకప్పుడు తెలుగు లోనూ పాపులర్‌ నవలలు కొన్ని తెరకెక్కాయి. ఇప్పుడు ఏదీ లేదు...

మూడు ప్రశ్నలు : వేణు ఊడుగుల

మలయాళం హిట్‌ సినిమాలు ‘జల్లికట్టు’, ‘ఆడు జీవితం’ నుంచి తమిళంలో ‘అసురన్‌’, ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సినిమాల దాకా పుస్తకాల నుంచి అడాప్ట్‌ చేసుకున్నవే. ఒకప్పుడు తెలుగు లోనూ పాపులర్‌ నవలలు కొన్ని తెరకెక్కాయి. ఇప్పుడు ఏదీ లేదు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే తెలుగులో సినిమా - సాహిత్య రంగాల మధ్య సంబంధం ఇంత తక్కువగా ఎందుకు ఉంది?

తమిళ మలయాళ చిత్ర పరిశ్రమల్లో లిటరేచర్‌ - సినిమాల మధ్య అనుబంధం చాలా బలంగా, ఆత్మీయంగా ఉంది. జల్లికట్టు, పోన్నియన్‌ సెల్వన్‌, అసురన్‌ వంటి వైవిధ్యమైన అనుసరణలను మనం ఈమధ్యనే చూశాం. ఇలాంటి నెరెటీవ్స్‌ని ఇష్టపడే ప్రేక్షకులు మన తెలుగు బాషలో కంటే ఆ రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు. పూర్వం నుండే వారికి ఒక రిచ్‌ లిటరరీ కల్చర్‌, సపోర్టివ్‌ ఎకో సిస్టమ్‌ ఉంది. వీటికి తోడు సాహిత్య నేపథ్యం నుంచి వచ్చిన దర్శక నిర్మాతలు అక్కడ ఎక్కువ ఉన్నారు. ఈ కల్చరల్‌ ఇంటిగ్రేషన్‌ వల్లే వారి సినిమాటిక్‌ నెరెటీవ్స్‌ ఈస్తటికల్‌ వాల్యుస్‌తో పరిణతి చెందాయి. ఇందుకు విరుద్ధంగా, తెలుగు సినిమాలో సాహిత్య అనుసరణలు చాలా తక్కువ. ఇందుకు తెలుగు సినిమా వ్యాపార దృష్టే కారణం. తరాలుగా ప్రేక్షకుల టేస్ట్‌ కూడా అలాగే షేప్‌ అవుతూ వచ్చింది. ఈ తరం ప్రేక్షకుల్లో ఈ ‘స్ట్రీమింగ్‌ ఎరా’ వల్ల ఫిల్మ్‌ లిట్రసీ పెరిగి ‘ఛాయిస్‌ ఆఫ్‌ సినిమా’ కొంతవరకు మారింది. ఐనా కూడా ఇక్కడ ‘కథ’ని పెట్టుబడే నిర్ణయిస్తోంది. అందుకే ఇక్కడ మార్కెటబుల్‌ కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటోంది. అదనంగా, సినిమాటిక్‌ అడాప్షన్‌కి తగిన కాంటెంపరరీ నవల కొరత కూడా ఉంది. మరీ ముఖ్యంగా మన తెలుగు ఫిల్మ్‌ మేకర్స్‌లో చాలావరకు సాహిత్యంతో తక్కువ రిలేట్‌ అవటం వల్ల కూడా లిటరరీ వర్క్స్‌ని ఐడెంటిఫై చేసి అడాప్ట్‌ చెయ్యటం కష్టం అవుతోంది.


‘‘స్ట్రీమింగ్‌ ఎరా వల్ల పెరుగుతున్న ఫిల్మ్‌ లిటరసీ..’’ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? కథని పెట్టుబడి, పెట్టుబడిని రాబడి, రాబడిని ప్రజల అభిరుచి నిర్ణయిస్తున్నాయీ అనుకుంటే, అల్టిమేట్‌గా ప్రజల అభిరుచి దగ్గరకే ప్రశ్న వెళ్ళి ఆగుతుంది. ప్రజల అభిరుచి మారాలంటే ఎలా?

ప్రపంచంలో జరిగిన అనేక సాహిత్య పరిణామాలకు అనుగుణంగా ఫ్రెంచ్‌ ఇంప్రెషనిజం, జెర్మన్‌ ఎక్స్‌ప్రెషనిజం, సోవియట్‌ మాంటెజ్‌, డాగ్మా 95 వంటి ఫిల్మ్‌ మూమెంట్స్‌ 21వ శతాబ్దం వరకు సాగాయి. వీటి వల్లే ఫిల్మ్‌ మేకింగ్‌ ఎప్పటికప్పుడు మార్పుచెందుతూ వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ‘‘స్ట్రీమింగ్‌ యుగం’’ వల్ల ఫిల్మ్‌ మేకింగ్‌, ఫిల్మ్‌ వ్యూయింగ్‌ రెండు రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వైడ్‌ రేంజ్‌ గ్లోబల్‌ కంటెంట్‌ని చూడ్డానికి ప్రేక్షకులకు గొప్ప ఆక్సెస్‌ దొరికింది. ఈ షిఫ్ట్‌ ప్రేక్షకులను మరింత వివేకవంతంగా ఇన్‌ఫ్లుయెన్స్‌ చేసే స్థాయికి వెళ్లింది. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ మార్పు కనిపిస్తోంది. కథ - పెట్టుబడి - రాబడిల సైకిల్‌ పూర్తిగా ఈ మార్పు మీదే ఆధారపడి ఉంది. అందుకే ప్రేక్షకుల అభిరుచిని మెరుగుపరచేందుకు వారికి విభిన్న సినిమాటిక్‌ స్టైల్స్‌, టెక్నిక్స్‌ గురించి అవగాహన కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అదనంగా ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌, వివిధ ఆర్ట్‌ ఫామ్స్‌ని హైలైట్‌ చేసే చర్చల ద్వారా సినిమాటిక్‌ కల్చర్‌ డెవలప్‌ అవుతుంది. భవిష్యత్తులో తెలుగు సినిమా ‘కథ’ సబల్టర్న్‌ లైఫ్స్‌లో లొకేట్‌ అవుతుంది. రకరకాల ప్రాంతాల, మనుషుల బతుకులను అడ్రస్‌ చేసే వేదికవుతుంది. తమిళ మలయాళ సినిమాల్లా తెలుగు సినిమా కూడా డైవర్సిటీతో వికసిస్తుంది.


సాహిత్యాన్ని సినిమాకి అడాప్ట్‌ చేసుకునే దిశగా ఒక సినిమా దర్శకుడిగా మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి. మీరు చదివిన తెలుగు సాహిత్యంలో సినిమాకు అడాప్ట్‌ కాగలిగే పుస్తకాలేమిటి?

సినిమా దర్శకుడిగా, నేను సాహిత్యాన్ని సినిమాకి అడాప్ట్‌ చేసుకోవడం చాలా సున్నితమైన, సృజనాత్మకమైన ప్రక్రియగా భావిస్తాను. మంచి సాహిత్యంలో కథా విస్తృతి, లోతైన తాత్వికత, భావోద్వేగాలు గాఢంగా ఉంటాయి. అలా అని ప్రతీదీ సినిమాకి అనువైనది కాకపోవచ్చు. మనం ఎంచుకునే సాహిత్యంలో ఉండే పాత్రలు రక్త మాంసాలతో సజీవంగా, శక్తివంతంగా ఉండాలి. కథ వాస్తవికంగా, భావోద్వేగాలతో ఉంటూనే ఆసక్తికరంగా ఉండాలి. సెన్స్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీ ఉండాలి, లేకపోతే క్రియట్‌ చేసుకోవాలి. సోషల్‌ రియాలిటీస్‌ని ఆవిష్కరించే కథా వస్తువులైతే మరీ మంచింది. నేను చదివిన తెలుగు సాహిత్యంలో, కల్యాణ్‌ రావు రాసిన ‘అంటరాని వసంతం’, కేశవరెడ్డి నవలలు సినిమాటిక్‌ అడాప్టేషన్‌కి ఉత్తమంగా సరిపోతాయి. ఈ కథలు మన సంస్కృతిలో ద్రవిస్తూనే, ఒక ప్రవాహంలా వేగంగా సాగిపోతూ ఉంటాయి. గ్లోబల్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ కథలు మనుషుల అనుభవాలపై, సోషల్‌ డైనమిక్స్‌పై డిఫరెంట్‌ పెర్‌స్పెక్టివ్‌ని అందిస్తాయి. భవిష్యత్తులో నేను కూడా ఒక నవల ఆధారంగా సినిమా చేయబోతున్నాను. అది ప్రేక్షకులకు ఒక విశేష అనుభవాన్ని అందించే అరుదైన సినిమా అవుతుంది.

(వేణు ఊడుగుల కవి, సినిమా దర్శకుడు)

Updated Date - Jul 29 , 2024 | 02:26 AM

Advertising
Advertising
<