బాహ్యాంతరంగం
ABN, Publish Date - Aug 26 , 2024 | 12:39 AM
సరస్సు మాట్లాడినప్పుడు నేను వినను అలలు సరస్సు గురించి మాట్లాడినప్పుడు వింటాను చేపలు కూడా చలనం గురించి మాట్లాడినప్పుడు వింటాను...
సరస్సు మాట్లాడినప్పుడు
నేను వినను
అలలు సరస్సు గురించి మాట్లాడినప్పుడు వింటాను
చేపలు కూడా చలనం గురించి
మాట్లాడినప్పుడు వింటాను
సముద్రం మాట్లాడినప్పుడు వినను
కెరటాలు సాగరం గురించి మాట్లాడినప్పుడు వింటాను
తిమింగలం
జీవితం లోతు గురించి మాట్లాడినప్పుడు వింటాను
చెట్టు మాట్లాడినప్పుడు వినను
కొమ్మ మీద కూర్చున్న పిట్ట
చెట్టు గురించి మాట్లాడినప్పుడు వింటాను
నీడనిచ్చే స్వభావం గురించి వింటాను
స్మశానం మాట్లాడినప్పుడు వినను
సమాధి మాట్లాడినప్పుడు వింటాను
అబద్ధానికీ నిజానికీ మధ్య వున్న తెర గురించి
మాట్లాడినప్పుడు వింటాను
మనిషితో మాట్లాడలేను
అతనిలోని ఆత్మ మాట్లాడితే వింటాను
నగ్నముని
Updated Date - Aug 26 , 2024 | 12:39 AM