బిర్సా పోరాట స్ఫూర్తి అమరం !బిర్సా పోరాట స్ఫూర్తి అమరం !బిర్సా పోరాట స్ఫూర్తి అమరం !
ABN, Publish Date - Nov 14 , 2024 | 12:31 AM
పట్టుమని ఈ నేల మీద పాతికేళ్లు మాత్రమే జీవించినా ఆదివాసీలకు ఆరాధ్య దైవంగా మారాడు బిర్సా ముండా. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా ఉలిహత్ గ్రామంలో 1875 నవంబర్ 15న సుగుణ ముండా, కర్మిహాట్...
పట్టుమని ఈ నేల మీద పాతికేళ్లు మాత్రమే జీవించినా ఆదివాసీలకు ఆరాధ్య దైవంగా మారాడు బిర్సా ముండా. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా ఉలిహత్ గ్రామంలో 1875 నవంబర్ 15న సుగుణ ముండా, కర్మిహాట్ దంపతులకు జన్మించాడు. చయిబాసాలోని మిషనరీ స్కూల్‌లో చదువుకోవటానికి క్రైస్తవం లోకి మారాడు. చదువుకుంటూనే అడవి మీద ఆధారపడే ఆదివాసుల హక్కులకై పోరాడాడు. అప్పట్లో ఆదివాసీ భూములపై బ్రిటిష్ పాలకులు అధిక పన్నులు వసూలు చేసేవారు. చెల్లించని వారి ఆస్తులను లాక్కునేవారు. భూములను తిరిగి ఇచ్చేయాలని ఒక రోజు తెగ పెద్దలతో కలిసి బిర్సా ముండా తెల్లదొరలపై ఒత్తిడి చేశాడు. దాంతో మిషనరీ స్కూల్ ఆయనను బహిష్కరించింది. వారి ఎదుటే నుదుట నామం పెట్టి, జంధ్యం ధరించి, ఇకపై క్రైస్తవం లోకి ఒక్క ఆదివాసీని కూడా మారకుండా చూస్తానని బిర్సా ప్రతినబూనాడు. కుంతి, తామర్, బసియా, రాంచీ ప్రాంతాలను సరిహద్దులుగా చేసుకుని ఆదివాసీ హక్కుల కోసం మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపాడు.
బిర్సాయిత్ మతాన్ని స్థాపించాడు. ఆదివాసీలు ఆయనను ధర్తీలబా (దేవుడు)గా కొలిచారు. ఆదివాసీ ప్రతిఘటన ప్రమాదాన్ని గుర్తించిన బ్రిటిష్ పాలకులు ఆయనను అరెస్ట్ చేసి 1900 జూన్ 9న విషప్రయోగంతో చంపేశారు. నేడు ఆ పోరాటవీరుడి అమర స్ఫూర్తి దేశమంతటా వ్యాపించింది.
ఎన్. సీతారామయ్య
(రేపు బిర్సా ముండా 150వ జయంతి)
Updated Date - Nov 14 , 2024 | 12:31 AM