బుక్ బ్రహ్మ ఫెస్టివల్
ABN, Publish Date - Jul 08 , 2024 | 05:46 AM
2500 ఏళ్ళ సుదీర్ఘ చరిత్రగల దక్షిణ భారతీయ భాషల (తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం) ఘన వారసత్వాన్ని, ప్రపంచ సాహిత్య సంస్కృతిపై వాటి ప్రభావాన్ని చాటేందుకు....
2500 ఏళ్ళ సుదీర్ఘ చరిత్రగల దక్షిణ భారతీయ భాషల (తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం) ఘన వారసత్వాన్ని, ప్రపంచ సాహిత్య సంస్కృతిపై వాటి ప్రభావాన్ని చాటేందుకు, దక్షిణ భారతీయ భాషల రచయితలు, ప్రచురణకర్త లందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ‘బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్ - 2024’ జరుగుతున్నది. ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక మీడియా భాగస్వామిగా ఉన్న ఈ కార్యక్రమం ఆగస్ట్ 9 నుంచి 11 దాకా సెయింట్ జాన్స్ ఆడిటోరియం, కోరమంగల, బెంగళూరులో జరుగుతుంది. కె. సచ్చిదానందన్, జెయమోహన్, పెరుమాళ్ మురుగన్, కె. శివారెడ్డి, వివేక్ శాన్‌భాగ్, ఓల్గా, వసుదేంధ్ర, గిరిష్ కాసరవల్లి, వాడ్రేవు చినవీరభద్రుడు, అక్కినేని కుటుంబరావు, ప్రకాష్ రాజ్, సి. మృణాళిని, జూపాక సుభద్ర, ఎమ్.ఎమ్. వినోదిని, కాత్యాయనీ విద్మహే, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, మహమ్మద్ ఖదీర్ బాబు, మల్లిపురం జగదీష్, వేంపల్లె షరీఫ్, ఉణుదుర్తి సుధాకర్, కె.ఎన్. మల్లీశ్వరి, కుప్పిలి పద్మ, వివిన మూర్తి, పూర్ణిమ తమ్మిరెడ్డి, మానస ఎండ్లూరి, రమేష్ కార్తీక్ నాయక్... ఇంకా అనేకమంది దక్షిణ భారత భాషల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
కార్యక్రమంలో సాహిత్యకారుల సమావేశాలతోపాటు ప్రచురణ కర్తల సమావేశాలు, సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉంటాయి. ఈ ఉత్సవంలో పాల్గొనదలచిన వారు www.bookbrahmalitfest.com వెబ్‌సైట్‌కు వెళ్ళి మీ పేర్లను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న డెలిగేట్స్‌కు ఎంట్రీపాస్ లభిస్తుంది. వారికి మాత్రమే ఫెస్టివల్ గ్రౌండ్స్‌లో ప్రవేశం ఉంటుంది.
Updated Date - Jul 08 , 2024 | 05:46 AM