ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కలల్ని అంటుకడుతో...

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:35 AM

ఏనాడూ అడగకండి ఓ కామ్రేడ్ ఎలా చనిపోతాడని? ఓ చెట్టులా, ముందతన్ని ఇంటి నుండి పెకలించారు వెలుతురూ వాన మబ్బులూ గాలీ లేకుండా అండాసెల్‌లో నిర్బంధించారు.....

ఏనాడూ అడగకండి

ఓ కామ్రేడ్ ఎలా చనిపోతాడని?

ఓ చెట్టులా,

ముందతన్ని ఇంటి నుండి పెకలించారు

వెలుతురూ వాన

మబ్బులూ గాలీ లేకుండా

అండాసెల్‌లో నిర్బంధించారు.

రాజ్యం చెట్టు

రసాన్ని పీల్చి పిప్పి చేసి

మాయమయ్యేలా చేస్తుంది.

రచయితలు తమ

మరణ యోగ్యతా పత్రాలను రాస్తారు

కొంచెం కొంచెంగా,

నెమ్మదిగా,

వైద్యపరంగా,

సూక్షంగా.

వాళ్ళు ఒక చెట్టును చంపగలరు

కానీ

అతని చక్రాల కుర్చీ చక్రాలకు

అతని సిరాతో అంటుకట్టినట్లు

వేనవేలుగా విస్తరించిన వాటి వేర్లనెలా చంపగలరు?

కామ్రేడ్ మరణానికి ఎప్పుడూ దుఃఖపడకండి

చుట్టూ చూడండి

ఎల్లప్పుడూ చెట్టు తన ఆకులను

ఈలలా ఊదుతున్నట్లు

కనుగొంటారు మీరు

యుద్ధం ఇంకా నడుస్తూనే ఉంది

సాయిబాబా ఎన్నటికీ మరణించడు.

ఇంగ్లిష్‌ మూలం : మౌమితా ఆలం

తెలుగు అనువాదం : అరుణాంక్ లత

arunank.latha@gmail.com

Updated Date - Oct 21 , 2024 | 12:35 AM