ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిధులేమవుతున్నయ్‌ ?

ABN, Publish Date - May 17 , 2024 | 03:41 PM

ఎన్నికల నాడు ఓటర్లు, పోలింగ్‌ సిబ్బందికి వసతులు కల్పించడంలో రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు విఫలమయ్యారు. చాలా పోలింగ్‌ కేంద్రాల్లో వీల్‌చైర్లు, ర్యాంపులు కనిపించలేదు. ఫలితంగా వృద్ధులు, వికలాంగుల అవస్థలు చెప్పలేనివి. తాగునీటి సదుపాయం కూడా అంతంతే.

- పోలింగ్‌ రోజున అరకొర వసతులు

- చాలాచోట్ల కనబడని వీల్‌చైర్లు, ర్యాంపులు

- ఓటు వేయడంలో వృద్ధులు, వికలాంగులకు తిప్పలు

- విధుల్లో ఉన్న సిబ్బంది ఆకలి కేకలు

- నాసిరకం బిర్యానీ, నీళ్ల చారు సరఫరా

- రుచి లేని ఉప్మా.. పాచిపోయిన అన్నం

- నాలుగు పోలింగ్‌ బూత్‌లకు ఒకే బాత్రూమ్‌

- ఒక్కో లోక్‌సభ పరిధిలో రూ.2-4 కోట్ల వ్యయం

హైదరాబాద్‌ సిటీ, మే 17 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నాడు ఓటర్లు, పోలింగ్‌ సిబ్బందికి వసతులు కల్పించడంలో రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు విఫలమయ్యారు. చాలా పోలింగ్‌ కేంద్రాల్లో వీల్‌చైర్లు, ర్యాంపులు కనిపించలేదు. ఫలితంగా వృద్ధులు, వికలాంగుల అవస్థలు చెప్పలేనివి. తాగునీటి సదుపాయం కూడా అంతంతే. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వెలుతురు సౌకర్యం కూడా కల్పించలేదు. ఇక పోలింగ్‌ సిబ్బంది ఆకలితో అల్లాడిపోయారు. ఈవీఎంలు పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లిన ఆదివారం.. పోలింగ్‌ డే సోమవారం.. రెండురోజులపాటు కడుపు నిండా భోజనం లేక నీరసించారు. పోలింగ్‌ సిబ్బందికి ఏ ఆహారం ఇవ్వాలన్న దానిపై మెనూ రూపొందించారు. ఉదయం టిఫిన్‌, స్నాక్స్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌గా ఏం ఇవ్వాలన్నది పేర్కొన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో మజ్జిగ/నిమ్మరసంతోపాటు..ప్రతి రెండు గంటలకోసారి ఏదైనా ఆహారం ఉండేలా చూసుకోవాలని సూచించారు. పచ్చి కూరగాయలు, సమోస వంటివీ ఇవ్వాలని మెనూలో ఉంది. పోలింగ్‌ రోజు మధ్యాహ్నం భోజనంగా ఎగ్‌ కర్రీ, వెజిటేబుల్‌కర్రీ, చట్నీ, సాంబారు వంటివి ఉండాలి. భోజనంలో పెరుగు తప్పనిసరి. కానీ మెనూ ప్రకారం ఒక్క పోలింగ్‌ కేంద్రంలోనూ సిబ్బందికి భోజనం అందలేదు. పాచిపోయిన వెజిటేబుల్‌ బిర్యానీ, నీళ్ల ఉప్మా, చారు వంటివి మాత్రమే ఇచ్చారు. చాలాచోట్ల పెరుగు ఊసే లేదు. ఎన్నికల నాడు ఎండ ఎక్కువగా లేదని నిమ్మరసం/మజ్జిగ వంటివి చాలా చోట్ల ఇవ్వలేదు.

రెండురోజులు నరకం

’మీరు సరైన ఏర్పాట్లు చేయరు..విధులకు రామని వినతిపత్రాలిస్తే.. ఇవేం కారణాలు.. క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.. సస్పెండ్‌ చేస్తామని హడలెత్తించిన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో కనీస వసతుల కల్పనను ఎప్పటిలానే పట్టించుకోలేదు. దీంతో మెజార్టీ పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బంది తీవ్ర అవస్థలు పడ్డారు. సరైన సదుపాయాలు లేక రెండు రోజులు నరకం చూశామని, మరుగుదొడ్లు, బాత్‌రూంలు సరిపడా లేక అవస్థలు పడ్డామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే భవనంలో నాలుగైదు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు.. ఆ స్థాయిలో వసతులున్నాయా..? అన్నది పట్టించుకోలేదు. ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో 20 నుంచి 25 మంది సిబ్బంది పనిచేస్తారు. వారందరికి ఒకటి, రెండు బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లు అందుబాటులో ఉండడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానం చేసేందుకు ఇబ్బంది పడ్డారు.

నేలమీద పడుకున్నా..

’15 మందికి ఒకే బాత్‌రూమ్‌, మరుగుదొడ్డి ఉంది. దీంతో అర్ధరాత్రి 2 గంటలకు లేచి స్నానం చేయాల్సి వచ్చింది. నిద్ర సరిపోకపోవడంతో పోలింగ్‌ విధి నిర్వహణలోనూ ఇబ్బంది పడ్డా’ అని సనత్‌నగర్‌లో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా పనిచేసిన ఓ అధికారి చెప్పారు. పడుకునేందుకు వసతి లేదని, దుప్పట్లు ఇచ్చే పరిస్థితి లేక నేల మీద పడుకోవాల్సి వచ్చిందని మరో ఉద్యోగి వాపోయారు. ’విద్యుత్‌ అంతరాయంతో ఫ్యాన్‌ తిరగలేదు. దీంతో రాత్రంతా పడుకోలేకపోయా’ అని చార్మినార్‌ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగి అన్నారు.

చాలాచోట్ల ఇదే సీన్‌

రాజేంద్రనగర్‌ నియోజకవర్గం మైలార్‌దేవ్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో 36 మంది సిబ్బందిలో 30 మంది పురుషులు, ఆరుగురు మహిళలు పనిచేశారు. పురుషులు 30 మందికి ఒకే బాత్‌రూమ్‌ అందుబాటులో ఉంది. తెల్లవారుజామున 5 గంటలకే కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఒకే బాత్‌రూమ్‌ ఉండడంతో 30 మంది కాలకృత్యాలు తీర్చుకొని.. స్నానం చేసేందుకు చాలా అవస్థలు పడ్డాం. ఆ రోజు రాత్రి సరిగా నిద్రపోలేదు’ అని విద్యాశాఖకు చెందిన ఓ ఉద్యోగి గోడు వెళ్లబోసుకున్నారు. ‘బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ప్రిసైడింగ్‌ అధికారిగా విధులు నిర్వర్తించా. పోలింగ్‌ ముందు రోజు, పోలింగ్‌ నాడు మధ్యాహ్నం వెజ్‌బిర్యానీ ఇచ్చారు. దుర్వాసన వస్తుండడంతో తినకుండా పక్కన పడేశా. ఉదయం నీళ్ల ఉప్మా ఇచ్చారు’ అని మరో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - May 17 , 2024 | 04:27 PM

Advertising
Advertising