నేను చనిపోవడానికి నిరాకరిస్తున్నాను
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:31 AM
మరణించేది లేదని తెగేసి చెప్పాక నా సంకెళ్ళు తెగాయి జైలు బయటికి వచ్చి విశాల మైదానాల్లో అడుగుపెట్టిన వెంటనే గడ్డిపరకల్ని చూసి నవ్వాను...
మరణించేది లేదని తెగేసి చెప్పాక
నా సంకెళ్ళు తెగాయి
జైలు బయటికి వచ్చి
విశాల మైదానాల్లో అడుగుపెట్టిన వెంటనే
గడ్డిపరకల్ని చూసి నవ్వాను
నా చిర్నవ్వును సహించలేక
మళ్ళీ సంకెళ్ళకు పనిచెప్పారు
మళ్ళీ మళ్లీ మృత్యువును తిరస్కరిస్తుంటే
నా జీవితమే వాళ్ళకి తలనొప్పిగా మారింది
విసుగెత్తి నన్ను వదిలేసారు.
మరోసారి ఆకుపచ్చలోయల్లోకి అడుగుపెట్టాను
పొడుస్తున్న పొద్దుకింద
తలెగరేస్తున్న గడ్డిపోచల్ని నవ్వుతూ పలకరించాను
చెరగని నా చిర్నవ్వు చూసి
వాళ్ళకి చిర్రెత్తుకొచ్చింది
మళ్ళీ అదే బందిఖానా
మళ్లీ అదే మరణాన్ని తిరస్కరించే మొండితనం
విచారించాల్సిన విషయం ఏంటంటే
నన్నెలా చంపాలో కూడా వాళ్ళకి తెలియదు
ఎందుకంటే
మొలకెత్తె గడ్డిపువ్వుల సవ్వడిని
ప్రేమించడం తెలుసు నాకు.
ఇంగ్లీష్ మూలం: జీఎన్. సాయిబాబా
తెలుగు అనువాదం: శివప్రసాద్
Updated Date - Oct 22 , 2024 | 10:09 AM