ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఏడుగుర్రాల రాజు

ABN, Publish Date - Jun 03 , 2024 | 05:54 AM

కాలాలన్నీ గువ్వపిట్టల తీరుగ వొస్తై వచ్చిన తొవ్వల అంతే వేగంగా పోతై అర్కుడిదే పెద్దిర్కం. వస్తదిగని మబ్బుల గుంపులు మూగి మొహమాటం లేకుండా...

కాలాలన్నీ గువ్వపిట్టల తీరుగ వొస్తై

వచ్చిన తొవ్వల అంతే వేగంగా పోతై

అర్కుడిదే పెద్దిర్కం.

వస్తదిగని

మబ్బుల గుంపులు మూగి

మొహమాటం లేకుండా

చాట కొట్టిందాకా పోనేపోదు

ఎంత వొడుపు చేసి రాజేసినా

ఆకాశం పొయ్యి

మేలోనే మంటంటుకుంటుంది

ఒత్తుల సముద్రాలు

అప్పుడే సలసలమంటై

కదిలే నదులు

కట్టెజర్సుకొని పోతై

తొణికే చెరువులు

పక్కటెముకలు తీస్తై

గాలి సైన్యం

ఒళ్లంతా నిప్పులు మోసుకు తిరుగుతుంది

ఎండకు సలాం కొట్టిన నీడలు

ఒడుపుగా చెట్ల కింద దాక్కుంటై

కర్ఫ్యూ చౌరస్తాలో కలవరపడ్డట్లు

చెట్ల గుంపులు

బిక్కచచ్చిపోతై

ఊరు లేని పేరు మీద

ఒక్క మబ్బూ ఉర్కులాడదు

ఏడు గుర్రాల రాజు

కళ్లెం గట్టిగా లాగి మరీ

రథాన్ని ఆకుమీద కదిలే

రింగన పురుగును చేస్తాడు

ఇండ్లన్నీ మధ్యాహ్నాలను తిట్టిపోస్తూ

సాయంకాలాలకు

స్వాగత తోరణాలు కట్టిపెడ్తై

పైకప్పులకు వేలాడుతూ

పంఖాలు నటిస్తుంటాయి

కూలర్లు

శబ్దానికీ తుంపర్లకు పోటీ పెట్టి

చప్పుడును గెలిపిస్తుంటై

ఏసీలు మాత్రమే

దొరబాబులను

కిరణాల కటార్ల బారినుండి

తప్పిస్తుంటే

రెక్కల కష్టంమీద మాత్రమే

బతికే దేవుళ్ళు

చెమట నీళ్లన్నీ

భూదేవికి ధారపోస్తుంటారు

అంతా అసంకల్పితంగా

దివాకరుడి జపమే చేస్తారు కానీ

వాన తెరలు కట్టి

ఆయన ఏనాడూ సుర్రుమనకుండా

ఉపరితలంమీద ఊరేగుతూ

ఊయలూగుతూ ఉండేలా

చల్లబరచడానికి

వరుణుడి కన్నుకొట్టే పసిమి కావ్యం

ఏదైనా లోకమంతా కలిసి

అల్లితే బాగుండు!

ఏనుగు నరసింహారెడ్డి

89788 69183

Updated Date - Jun 03 , 2024 | 05:54 AM

Advertising
Advertising