ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రుణమాఫీ చారిత్రాత్మకం

ABN, Publish Date - Jul 26 , 2024 | 03:12 AM

తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ఒక గొప్ప చారిత్రాత్మక విషయం, యావత్ భారతదేశం గర్వించదగిన సందర్భం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో....

తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ఒక గొప్ప చారిత్రాత్మక విషయం, యావత్ భారతదేశం గర్వించదగిన సందర్భం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రైతు రాజ్యాన్ని స్థాపించే క్రమంలో రుణమాఫీ చేయడంతో రైతులందరూ హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్సాహంతో పంట సాగు విస్తీర్ణాన్ని పెంచే క్రమంలో ముందుకు పోతున్నారు. ఈ విషయంలో పార్టీలకతీతంగా అందరూ రుణమాఫీ పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రైతుల పరిస్థితి చాలా దీనాతిదీనంగా ఉంది. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక, అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయి అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ స్థితిలో రైతుకు భరోసాగా ప్రభుత్వం నిలబడడం ఆనందదాయకం.


ప్రపంచమంతా ఐటి, కంప్యూటర్ యుగం వైపు మరలుతున్న తరుణంలో ప్రపంచానికి అన్నం పెట్టే రైతును ఆదుకోవాలని సంకల్పం కలిగిన ప్రభుత్వాన్ని పది కాలాలు నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది.

ఎండి మక్బూల్, రంగాపూర్

Updated Date - Jul 26 , 2024 | 03:12 AM

Advertising
Advertising
<