ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓ నాలుగు కెరటాలు

ABN, Publish Date - Sep 30 , 2024 | 12:31 AM

సముద్రం ఓ పేద్ద చేప అలలు మొప్పలు మామూలు చేప నీళ్ళల్లో బతుకుతుంటే ఇది చిత్రంగా భూమ్మీద జీవిస్తుంది...

సముద్రం

ఓ పేద్ద చేప

అలలు

మొప్పలు

మామూలు చేప

నీళ్ళల్లో బతుకుతుంటే

ఇది చిత్రంగా

భూమ్మీద జీవిస్తుంది

సముద్రం

ఓ పేద్ద గుండె

అలలు

ధమనులు

మామూలు గుండె

లబ్ డబ్ అని కొట్టుకుంటుంటే

ఇది ఆటుపోట్లతో స్పందిస్తుంది

సముద్రం

ఓ సజీవపద్యం

అలలు

పాదాలు

మామూలు పద్యం

చదివితేగాని అర్థం కాదు

దీన్ని చూడగానే గొప్ప రససిద్ధి కల్గుతుంది

సముద్రం

దిగంతాలకు ఆవలినుండి

ఆత్రంగా ఆత్మీయంగా

తీరాన ఉన్న నన్ను

తనివితీరా

చూసిపోవడానికొస్తున్న మా అమ్మ

నలిమెల భాస్కర్

Updated Date - Sep 30 , 2024 | 12:31 AM