ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వంద శాతం నమోదు సాధ్యమే!

ABN, Publish Date - Nov 07 , 2024 | 02:46 AM

చదువుల పండగ, బడికి పోతాం– అంటూ దశాబ్దాల కాలం నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ బడి బైటి పిల్లలను బడుల్లో చేర్చలేకపోతున్నాం. రాష్ట్రంలో ఇంటర్‌ వరకు చదివిన తర్వాత...

చదువుల పండగ, బడికి పోతాం– అంటూ దశాబ్దాల కాలం నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ బడి బైటి పిల్లలను బడుల్లో చేర్చలేకపోతున్నాం. రాష్ట్రంలో ఇంటర్‌ వరకు చదివిన తర్వాత 3,58,218 మంది విద్యార్థులు బడి బయట ఉన్నారని, పదవ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత 1,55,427 మంది బడి బయట ఉన్నారని, 1 నుండి 10వ తరగతి వరకు బడి బయట ఉన్న పిల్లల సంఖ్య 2,02,791 అని పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది.

రాష్ట్ర విద్యాశాఖ జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులను ఆదేశిస్తూ బడి బయట పిల్లలు ఎవరు లేకుండా 100 శాతం నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. వీటి ప్రకారం– అర్హత ఉన్న పిల్లలందరినీ పాఠశాలల్లోకి 100 శాతం నమోదు చేయాలి, 6–-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలెవరూ పాఠశాలలకు దూరంగా ఉండకుండా చూసుకోవాలి.


సమగ్ర శిక్షా జిల్లా విద్యా అధికారులు, అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు బడి బయట ఉన్న పిల్లలను రెగ్యులర్ పాఠశాలలు/ కెజిబివిలు/ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నమోదు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, హెడ్‌మాస్టర్లు, గ్రామ విద్యా సంక్షేమ సహాయకులు, వార్డు వాలంటీర్లు నిర్దేశించిన ప్రొఫార్మాలో నమోదు డేటాను ప్రతి వారం తప్పనిసరిగా రాష్ట్ర ఎస్ఎస్ కార్యాలయానికి పంపించాలని ఆదేశాలు వచ్చాయి. బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం వసతి గృహాలు పునరావాస కేంద్రాలను బలోపేతం చేయాలి. సమస్య ఎక్కువ ఉన్న చోట ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్వహిస్తే వలసలు ద్వారా ఏర్పడే డ్రాప్ అవుట్లను తగ్గించవచ్చు. బాల కార్మికులచేత పని చేయించుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ విభాగాలు చిత్తశుద్ధితో పనిచేస్తే 100 శాతం నమోదు సాధ్యమే.

-సి.వి. ప్రసాద్

రాష్ట్ర అధ్యక్షులు, ఏపీటీఎఫ్ అమరావతి

Updated Date - Nov 07 , 2024 | 02:46 AM