ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పారా ఒలంపిక్స్ విజేతలకు సెల్యూట్

ABN, Publish Date - Sep 11 , 2024 | 04:39 AM

పారిస్ వేదికగా జరిగిన విశ్వ క్రీడల సమరం ముగిసింది. ఒలంపిక్స్‌లో గతంలో కన్నా ఎక్కువగా మన క్రీడాకారులు రాణించకపోయిన పారా ఒలంపిక్స్‌లో మాత్రం మన క్రీడాకారులు అద్భుతంగా రాణించారు. ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే రాణించి...

పారిస్ వేదికగా జరిగిన విశ్వ క్రీడల సమరం ముగిసింది. ఒలంపిక్స్‌లో గతంలో కన్నా ఎక్కువగా మన క్రీడాకారులు రాణించకపోయిన పారా ఒలంపిక్స్‌లో మాత్రం మన క్రీడాకారులు అద్భుతంగా రాణించారు. ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే రాణించి ఎక్కువ పతకాలు సాధించారు. గతంలో టోక్యో వేదికగా జరిగిన ఈ క్రీడల్లో 19 పతకాలకే పరిమితమైన మన క్రీడాకారులు ఈసారి పతకాల సంఖ్యను పెంచుకొని ఏడు స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు... మొత్తం 29 పతకాలు సాధించి పతకాల పట్టికలో 16వ స్థానంలో మన దేశాన్ని నిలిపారు. అంచనాలకు మించి అద్వితీయమైన ప్రదర్శన చేసి మన దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఈ క్రీడలో పాల్గొన్న క్రీడాకారులది ఒక్కొక్కరిదీ ఒక్కొక్క విజయగాథ. ప్రస్తుత యువత వీరి విజయాలను గమనించాల్సిన అవసరం ఉంది. నేటి యువత టెక్నాలజీ ఉచ్చులో చిక్కుకొని తమ సమయాన్ని మొత్తం సోషల్ మీడియాకు అంకితం చేసి సమయాన్ని వృధా చేస్తున్నారు.


అనేకమంది రీల్స్ పిచ్చిలో చిక్కుకొని విచిత్ర పోకడలకు పోయి మృతి ఒడిలోకి పోతున్నారు. కొందరు యువత మత్తు మందులకు బానిసలుగా మారి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. అలాంటి యువతకు ఈ క్రీడాకారులందరూ ఒక స్ఫూర్తిదాయకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి విజయగాథలను పాఠ్యపుస్తకాల ద్వారా నేటి విద్యార్థి లోకానికి అందించాల్సిన అవసరం ఉంది.

చింత ఎల్లస్వామి

Updated Date - Sep 11 , 2024 | 04:39 AM

Advertising
Advertising