ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎపిలోగ్

ABN, Publish Date - Sep 09 , 2024 | 05:43 AM

ఆఖరి కన్నీటిబొట్టుని ఆనుకుని ఓ ధైర్యవచనం ఉండే ఉంటుంది దుఃఖాన్ని చెరిపేస్తూ, సాంత్వనగా చెప్పడానికేమీ లేదనుకున్నపుడు

ఆఖరి కన్నీటిబొట్టుని ఆనుకుని

ఓ ధైర్యవచనం ఉండే ఉంటుంది

దుఃఖాన్ని చెరిపేస్తూ, సాంత్వనగా

చెప్పడానికేమీ లేదనుకున్నపుడు

ఇంద్రియాలన్నీ పుష్పించేలా

ఒక తొలకరి వాన పడుతుంది

ముగింపు నచ్చని పుస్తకం చివర

ఓ ఖాళీ పేజీ ఉండే ఉంటుంది

నచ్చిన వాక్యం రాసేందుకు వీలుగా

రాయడానికింకేమీ లేదనుకున్నపుడు

తీరంలో శిలల శిరస్సునుండి

ఆదిమ సంగీతం వినిపిస్తుంది

అంతటా అరుచి ప్రోది అయినపుడు

ఇష్ట స్మృతుల పునరాగమనంతో

స్వప్నవృష్టిలో తడవాలన్న ఇఛ్చ

దేహదాహంగా వ్యక్తమవుతుంది

మాటలన్నీ ఇంకిపోయాయనుకున్నపుడే

సీతాకోకల గుంపొకటి వచ్చి

నిశ్శబ్దాన్ని పటాపంచలు చేస్తుంది

n మల్లారెడ్డి మురళీ మోహన్

& 88611 84899

Updated Date - Sep 09 , 2024 | 05:43 AM

Advertising
Advertising