ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విశిష్ట ట్రేడ్‌ యూనియనిస్ట్‌ ఎన్‌.వి.భాస్కరరావు

ABN, Publish Date - Nov 30 , 2024 | 05:40 AM

హైదరాబాదు నగర సిపిఐ(ఎం) పార్టీ, సిఐటియు వ్యవస్థాపకులు కామ్రేడ్‌ ఎన్‌.వి. భాస్కరరావు వాటి నిర్మాణం, విస్తరణ క్రమంలో (1964–84) ముఖ్యపాత్ర నిర్వహించారు. భాస్కరరావు సహచరుల,

హైదరాబాదు నగర సిపిఐ(ఎం) పార్టీ, సిఐటియు వ్యవస్థాపకులు కామ్రేడ్‌ ఎన్‌.వి. భాస్కరరావు వాటి నిర్మాణం, విస్తరణ క్రమంలో (1964–84) ముఖ్యపాత్ర నిర్వహించారు. భాస్కరరావు సహచరుల, అనుయాయీల జ్ఞాపకాలను అనుభవజ్ఞులైన సంపాదకవర్గం సాయంతో ఆయన ముగ్గురు కుమార్తెలు రూపొందించిన ‘హైదరాబాదు కార్మికోద్యమ దశ, దిశ మార్చిన కా. ఎన్‌.వి. భాస్కరరావు’ పుస్తకాన్ని కా. బి.వి.రాఘవులు (సిపిఐఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు) నవంబర్‌ 30న ఉ. 11.గం.లకు సిపిఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ 23వ మహాసభల ప్రారంభ సభలో ఆవిష్కరిస్తారు. హైదరాబాద్‌ ఎస్‌.ఆర్‌. నగర్‌ మెట్రో సమీపంలోని శ్రీనివాసనగర్‌ వెస్ట్‌ కమ్యూనిటీ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఎన్‌.వి. భాస్కరరావు కృష్ణా జిల్లా చల్లపల్లి దగ్గరున్న కమ్యూనిస్టు ప్రభావిత నాదెళ్ళవారి పాలెం అనే గ్రామంలో 1931 జనవరి 9న నాదెళ్ళ రంగయ్య, వెంకటనర్సమ్మ దంపతులకు జన్మించారు. ఆ ఊరిలోని కొంతమంది కమ్యూనిస్టు పార్టీ నాయకులతోపాటు, పుచ్చలపల్లి సుందరయ్య ప్రభావం అతిచిన్న వయస్సులోనే భాస్కరరావు మీద పడింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సమయంలో (1946–1951) ముఖ్య నాయకులకు కొరియర్‌ గా భాస్కరరావు రాజకీయ ప్రస్థానం మొదలైంది. పార్టీ ఆఫీసు కార్యదర్శిగానూ, సిపిఐ(ఎం) శాసనసభాపక్ష ఆఫీసు కార్యదర్శిగాను, పార్టీ కార్యక్రమాలలోనూ భాస్కరరావు చురుగ్గా పనిచేశారు. 1964లో పార్టీ మొట్టమొదటి చీలిక తరువాత నుండి, చనిపోయేవరకు (1984 అక్టోబర్‌ 24) సిపిఐ(ఎం) హైదరాబాదు నగర కార్యదర్శిగా పనిచేశారు. 1970–84 మధ్యకాలంలో ఇతర ట్రేడ్‌ యూనియన్‌ నాయకులతో కలసి ట్రేడ్‌ యూనియన్‌ రంగంలో గుణాత్మకమైన మార్పులను తీసుకొని రాగలిగారు. ప్రభుత్వ రంగ సంస్థలలోను, ప్రైవేటు రంగ పరిశ్రమలలోను, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌ రంగాలలోను, ప్రభుత్వోద్యోగుల సంఘాలలోను, ఇతర ప్రజాసంఘాలలోను సిఐటియుని, పార్టీని నగరంలోని అనేక ప్రాంతాలకు విస్తరింపచేశారు. చాలామంది పార్టీ కార్యకర్తలను భాస్కరరావు ఓర్పుతో, పట్టుదలతో నిబద్ధతతో నాయకులుగా తీర్చిదిద్దారు. నిశితమైన వివ్లవ లక్ష్యంతో తుదిశ్వాస వరకు నిలబడిన ఆదర్శమూర్తి ఎన్‌.వి. భాస్కరరావు.

– శ్యామల, నిర్మల, ప్రమీల

Updated Date - Nov 30 , 2024 | 05:40 AM