కెకె (కె.కనకాచారి) స్మారక ఉపన్యాసాలు
ABN, Publish Date - Aug 31 , 2024 | 05:47 AM
సమసమాజ స్వప్నాలతో మన సామాజిక, వృత్తిపర, ఉద్యమ ఆచరణను ప్రభావితం చేసిన మనిషి కె.కనకాచారి. ఆయన స్మారకంగా కె.కె.మెమోరియల్ ట్రస్టు ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరం భారత జాతీయోద్యమంలో ముస్లింల
సమసమాజ స్వప్నాలతో మన సామాజిక, వృత్తిపర, ఉద్యమ ఆచరణను ప్రభావితం చేసిన మనిషి కె.కనకాచారి. ఆయన స్మారకంగా కె.కె.మెమోరియల్ ట్రస్టు ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరం భారత జాతీయోద్యమంలో ముస్లింల పాత్రను, కేంద్రం తెచ్చిన నూతన న్యాయచట్టాల పర్యవసానాలను చర్చించనున్నాం. సెప్టెంబరు 1 ఆదివారం నాడు, మహబూబ్‌నగర్ టీఎన్‌జీవో భవన్‌లో ఉదయం 10గంటలకు కార్యక్రమం ఆరంభమవుతుంది. మొదటి సెషన్‌లో ‘భారత జాతీయోద్యమంలో తెలంగాణ ముస్లింయోధుల కృషి–నశీర్ అహమద్ రచనల పరిశీలనతో’ అంశంమీద న్యాయవాది జహారా, సామాజిక కార్యకర్త ఖలీదా పర్వీన్ మాట్లాడతారు. కె.వామన్‌కుమార్, డి. నర్సయ్య అధ్యక్షత వహిస్తారు. ప్రొ. జి.హరగోపాల్ అధ్యక్షతన జరిగే రెండోసెషన్‌లో ‘2023 భారత న్యాయచట్టాలు–పర్యవసానాలు’ అంశంపై ‘వీక్షణం’ సంపాదకులు ఎన్.వేణుగోపాల్ ప్రసంగిస్తారు.
– కె.కె.మెమోరియల్ ట్రస్ట్
Updated Date - Aug 31 , 2024 | 05:47 AM