ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఆమె’ జయించిన అడవి

ABN, Publish Date - Sep 16 , 2024 | 04:37 AM

‘ఆమె అడవిని జయించింది’ అన్న గీతాంజలి గారి నవల పేరు వినగానే వెంటనే స్ఫురించేది కేశవరెడ్డి గారి ‘అతడు అడవిని జయించాడు’ నవల. పురుషాధిక్య సమాజాల్లో ‘అతడు’ జయించడం...

‘ఆమె అడవిని జయించింది’ అన్న గీతాంజలి గారి నవల పేరు వినగానే వెంటనే స్ఫురించేది కేశవరెడ్డి గారి ‘అతడు అడవిని జయించాడు’ నవల. పురుషాధిక్య సమాజాల్లో ‘అతడు’ జయించడం ఉంటుంది గానీ, ‘ఆమె’ జయించటం ఉంటుందా?

గీతాంజలి ‘ఆమె అడవిని జయించింది’ నవల శీర్షికలో ‘అడవి’ అంటే– విశృంఖలతకూ, బంధనాలకూ, చీకటికీ, అజ్ఞానానికీ, కట్టుబాట్లకూ, యథాతథ స్థితికీ, అమాయకత్వానికి అర్థంపర్థంలేని ప్రేమలకూ, మోహాలకూ ప్రతీక. అడవిని జయించడం అంటే, వెలుగుని కనుక్కోవడం.

సమాజ దాష్టీకాల్ని మార్క్సిస్ట్‌ జ్ఞానంతో నిలవరించడం నేర్చుకున్న జానకి కథను రంగనాయకమ్మ ‘జానకి విముక్తి’ నవలలో చెప్పిన తర్వాత, కళా గీత ‘వెనుదిరగని వెన్నెల’ నవలలో స్త్రీ భావోద్వేగాలనీ, సమస్యల్నీ చిత్రిస్తూ, పరిష్కారాల దిశగా ప్రయత్నం చేసిన తర్వాత, అదేకోవలో గీతాంజలి ‘ఆమె అడవిని జయించింది’ నవల స్త్రీ భావోద్వేగాల్ని బలంగా ప్రతిఫలిస్తుంది.


సంధ్య వైద్య విద్యార్థినిగా చంద్రంతో రిలేషన్‌లో ఉంటూ ప్రేమా మోహాల్లో మునిగి తేలుతూ ఒక బిడ్డని కనడం, సిద్ధార్థ అనే కొలీగ్‌తో మోహంలో పడటం, ఎలానో బయటపడటం, అత్త మామల, తల్లిదండ్రుల ఫ్యూడల్ ఆచార వ్యవహారాల్ని నిరసిస్తూ బలహీనవర్గ స్త్రీ సామాజికంగా, కుల పరంగా, ఆరోగ్యపరంగా ఎదుర్కొనే ఆరళ్ళకు పరిష్కార మార్గాన్ని అన్వేషించడం... ఇలా ఆమె అడవి నుంచి వెలికి రావడం స్థూలంగా ఈ నవల కథాంశం. కథనం ఉత్తర తెలంగాణ యాసలో సమ్మోహనంగా సాగుతుంది. ఒక్కోసారి చైతన్య స్రవంతి టెక్నిక్‌ని వాడతారు రచయిత్రి. సంధ్యలో కాంట్రాడిక్టరీ ఎలిమెంట్స్‌ను సహజంగా చిత్రీకరించారు గీతాంజలి. ఎక్కడా మాస్కులుండవు, ముసుగులుండవు! సంధ్య, చంద్రం, సిద్ధార్థ– ఈ పాత్రలు కళ్ళ ముందు కనపడే వ్యక్తుల ప్రతీకలు. రియల్ లైఫ్ వ్యక్తిత్వాలు.

స్త్రీ మాంసాన్ని సౌందర్యారాధన పేరుతో కళ్ళతోనే కబళించే తన భర్త చంద్రాన్ని ఒకవైపు చీదరించుకుంటూనే, అవే ఎంగిలి చూపులు తనని తడుముతుంటే సంధ్య దాన్ని రొమాన్స్‌గా ఫీలవడంలోని నేలబారు భావాల్ని వెరపు లేకుండా చిత్రిస్తారు రచయిత్రి. సంధ్య ఒకపక్క భర్త చంద్రం గుండెలపై సేదతీరుతుంది, మరోపక్క మూడేళ్ల నుంచీ ‘‘నువ్వు కావాలి’’- అంటూ వెంటాడే సిద్ధార్థ ‘‘అనురాగ వర్షంలో తడిచి’’పోతుంది, గుండె కరిగి అతని వైపు ప్రవహిస్తుందేమోనని ‘‘వణికి’’ పోతుంది. ఇలా సంధ్యలోని మీనెస్ట్ కోణాన్నీ, అంతకంటే దిగజారి ‘‘నీకు ఇష్టమైతే అతనితో వెళ్ళు, కానీ ఇలా దుఃఖించకు’’ అంటూ ఓదార్చే చీపెస్ట్ చంద్రం టే‍స్ట్‌నూ నిర్భయంగా వెల్లడిస్తారు రచయిత్రి.


ఇంత అమాయకంగా, ఇంత రొమాంటిక్‌గా, ప్రేమలకూ మోహాలకూ మొహం వాచిపోయినట్లు ఉండే సంధ్య క్రమంగా మహిళా సమస్యల పట్ల అవగాహన పెంచుకుంటుంది. తర్వాత ఆ అవగాహనతో, ‘‘చదువుకుంటూ, తింటో, తిరుగుతో, బట్ట కడుతో, చంద్రంతో సుఖపడుతో, పిల్లల్ని కంటో, వాళ్ళ జంజాటంలో పడి నలిగి, పిగిలి, రంగు మాసి, వ్యక్తిత్వం మారి, జీర్ణ వస్త్రంలా మిగలకుండా,’’ కొత్తిమీర మొక్కంతైనా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో, స్త్రీ సమస్యలపై పోరాడే ‘మానవి’ సంస్థ తలుపు తడుతుంది. అక్కడి చర్చలకు మొహమెత్తి, తేజస్విని అందించిన చైతన్యంతో స్త్రీ విమోచన దిశగా అడుగులు వేస్తుంది.

ప్రేమలూ, మోహాలూ, బాంధవ్యాల కీకారణ్యంలో అల్లుకుపోయిన తీగ వలల్ని ఛేదించుకొని, అజ్ఞానపు చీకటి పొరలని చీల్చుకొని, కుళ్ళిన సమాజానికి స్కాల్పెల్ సరిపోదనీ, ‘మానవి’ సంస్థ లాంటి బిహేవియరల్ థెరపీలు కూడా చాలవనీ అర్థం చేసుకుని, చివరకు విమోచన మార్గాన్ని ఎంచుకున్న సంధ్య... అడవిని జయిస్తుంది.

వి. విజయకుమార్

85558 02596

Updated Date - Sep 16 , 2024 | 04:38 AM

Advertising
Advertising