ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శీతాకాలం

ABN, Publish Date - Nov 18 , 2024 | 05:43 AM

మంచుతెల్లగా మేల్కొంటున్న ఉదయం పల్లెలో పసికందు చేతివేళ్ళ స్పర్శలా ఉంటుంది ఆ సుపరిచితమైన స్పర్శ కావాలి ఆ శ్వాస పీల్చాలి ఆ ఆకాశం చూడాలి ఓ చలిమంట వేసుకోవాలి ఇంకా ఎండుగడ్డిపైన తల్లికుక్క...

మంచుతెల్లగా మేల్కొంటున్న ఉదయం

పల్లెలో పసికందు చేతివేళ్ళ స్పర్శలా ఉంటుంది

ఆ సుపరిచితమైన స్పర్శ కావాలి

ఆ శ్వాస పీల్చాలి

ఆ ఆకాశం చూడాలి

ఓ చలిమంట వేసుకోవాలి

ఇంకా ఎండుగడ్డిపైన తల్లికుక్క

తల్లికుక్కపైన కుప్పగా పడుకున్న దాని పిల్లలు

అదొక జీవన సంతులనం


రెక్కలకష్టం వినిపిస్తుంది శ్రామికుడిదీ, గువ్వలదీ

ఆ మంచుపూట ఎక్కడికెళుతుందీ గువ్వల గుంపు

గువ్వెగిరిపోగా ఊగుతున్న జొన్నకంకినవుతాను

నేను మంచుతెల్లగానూ, మంచులో పనిచేస్తున్న శ్రామికుడిలానూ,

శ్రామికుడి చేతిలోని పనిముట్టులానూ ఉండాలనుకుంటాను

ఒకవైపు మంచు

ఒకవైపు నిమ్మపువ్వులా వెలుతురు వికసం

జీవనసంధ్యా కరుణను పంచుతూ సూర్యుడు

గడ్డకట్టిన కొబ్బరినూనె కరుగుతూ ఉంటుంది

దుప్పటి వెచ్చటి వాసన వేస్తుంటుంది

రెండు నందివర్ధనం పువ్వులు త్రుంచి

చల్లగా కళ్ళకు తాకించి

ఒక శీతాకాలపు ఆనందంతో నడుస్తూ

అప్పటికి ఏ పాదం మోపని

మంచుతో నిండిన గడ్డిపైన నా పాదముద్రలు

నా జీవితం వైపుకు వెళ్ళేదారిలా వుంటుంది.

శాంతయోగి యోగానంద

91107 70545

Updated Date - Nov 18 , 2024 | 05:43 AM