గురువు
ABN, Publish Date - Sep 05 , 2024 | 01:30 AM
తమస్సు తరిమి వేసి విజ్ఞానపు విత్తును నాటే ఉషస్సు జ్ఞాన చక్షువును తెరిపించే అక్షర విధాత మట్టిని మాణిక్యాలుగా అజ్ఞానపు పిండాలను...
తమస్సు తరిమి వేసి
విజ్ఞానపు విత్తును నాటే ఉషస్సు
జ్ఞాన చక్షువును తెరిపించే
అక్షర విధాత
మట్టిని మాణిక్యాలుగా
అజ్ఞానపు పిండాలను
విజ్ఞానపు పుంజాలుగా
విద్యార్థిని విద్వత్తుగా మలిచే
విజ్ఞానపు అమృత భాండం
నాలుగు గోడల మధ్య
పరిపూర్ణ మేధస్సును పెంచి
లోకాన్ని వీక్షింపచేసే గవాక్షం
కలెక్టరైనా ప్రధాని అయినా
నన్ను మలిచింది ఈ మహానీయుడే అని
అర క్షణమైనా ఆలస్యం లేకుండా
తలవంచి నమస్కరించే అర్థం
గురువు...
పెండెం శివానంద్
Updated Date - Sep 05 , 2024 | 01:30 AM