ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్టీలనూ ఏబీసీడీలుగా వర్గీకరించాలి!

ABN, Publish Date - Sep 14 , 2024 | 05:01 AM

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎస్టీ జాబితాలో ఉన్న గిరిజన తెగలను, కులాలను ఏబీసీడీలుగా వర్గీకరించాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 33 ఆదివాసీ తెగలలో రాజ్యాంగం, రిజర్వేషన్ ఫలాలను సంక్షేమ పథకాలు...

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎస్టీ జాబితాలో ఉన్న గిరిజన తెగలను, కులాలను ఏబీసీడీలుగా వర్గీకరించాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 33 ఆదివాసీ తెగలలో రాజ్యాంగం, రిజర్వేషన్ ఫలాలను సంక్షేమ పథకాలు, విద్యా ఉద్యోగ రంగాల్లో కొన్ని కులాలు మాత్రమే అనుభవిస్తూ మిగతా 30 తెగలను అభివృద్ధికి దూరంగా నెడుతున్నాయి. ఎస్టీ జాబితాలో కేవలం విద్యపరంగా రిజర్వేషన్‌లో చేరిన లంబాడి, యానాది, ఎరుకుల కులాలు ఈరోజు ఎక్కువ లబ్ధి పొందుతున్నట్లు మిగత ఆదివాసీ తెగలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఆదివాసీ 30 తెగలు అబివృద్ధికి దూరంగా అడవులలో ఉంటూ జంతువులతో సహజీవనం కొనసాగిస్తున్న సందర్భంలో ఎస్టీ వర్గీకరణ అంశం చాలా కీలకం. గత కొన్నేళ్ళుగా ఎస్టీ జాబితా నుంచి. లంబాడీలను తొలగించాలని ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పటికీ పాలకులు సరిగ్గా స్పందించలేదు. ఆ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడు తేలే అవకాశం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కొంతమంది ఆదివాసీ మేధావులు ఎస్టీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలన్న డిమాండ్‌ ముందుకు తెస్తున్నారు.


నాడు ఆంధ్రా వలసల గురించి కొట్లాడిన తెలంగాణ సమాజం నేడు మహారాష్ట్రలో బీసీలుగా, కర్ణాటకలో ఎస్సీలుగా, రాజస్థాన్‌లో ఓసీలుగా చెలామణీ అవుతూ లక్షలాదిగా తెలంగాణలోకి వలసలు వస్తున్న లంబాడీలు ఇక్కడ విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో ఆదివాసీల రిజర్వేషన్లు దోచుకుంటున్నా పట్టించుకోవటం లేదు. ఒకే రాష్ట్రంలో ఉన్న ఆంధ్రావి వలసలు అయితే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే లంబాడాలవి వలసలు కావా?

లంబాడీ తెగ ప్రజలను గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలు టీడీపీ, తర్వాత టీఆర్‌ఎస్‌, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఓటు బ్యాంక్ కోసం ఎస్టీలుగా గుర్తిస్తూ మూల ఆదివాసులకు అన్యాయం చేస్తున్నాయి. ఇంకొక ఆకు ఎక్కువ చదివిన కేసీఆర్ లంబాడి తెగప్రజలే నిజమైన ఆదివాసులుగా గుర్తిస్తూ, అడవిలోని మూలవాసులపై మావోయిస్టులన్న ముద్ర వేశారు. అడవులను కాపాడుతున్న ఆదివాసులను హరితహారం పేరుతో, ఓపెన్ కాస్ట్‌ గనుల పేరుతో, ఖనిజాల వెలికితీత పేరుతో వేధించారు. అడవులను నాశనం చేస్తూ తిరిగి ఆదివాసులే అడవులను నాశనం చేస్తున్నారని ఉల్టా ప్రచారం చేశారు. ఆదివాసీ – -లంబాడీ తెగల మధ్య ఘర్షణకు కూడా కేసీఆర్‌ ప్రభుత్వమే కారణం.


మైదాన ప్రాంతాలలో నివసిస్తున్న లంబాడీ తెగ ప్రజల్లో కొందరు పేదలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం మంది అడవిలోని మూల ఆదివాసుల కన్నా సామాజికంగానూ, నాగరికంగానూ అభివృద్ధి చెందినవారు. వీరు తమ తెలివితేటలతో 90శాతం ఎస్టీ రిజర్వేషన్లను ఉపయోగించుకుంటున్నారు. ఇది బహిరంగ సత్యం.

పాలకులు, అధికారులు కూడా పలుకుబడికలిగిన వాళ్లకే ఉపయోగపడుతున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక చైతన్యం లేని ఆదివాసీలకు తీరని అన్యాయం జరుగుతున్నది. వాళ్లకు చెప్పాల్సిన, అందాల్సిన రిజర్వేషన్లు దక్కడం లేదు. అందుకే మూల ఆదివాసులకు – వలస లంబాడీ తెగ ప్రజలకు మధ్య ఆదిలాబాద్‌లో ఘర్షణ మొదలైంది. వీళ్ల మధ్య ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ ఘర్షణ రాష్ట్రమంతటా కార్చిచ్చులా పాకుతుంది. భౌతికదాడులు చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు అదిలాబాద్‌, వరంగల్, ఖమ్మంలో న్యాయం కోసం పోరాడుతున్న ఆదివాసీ నేతలపై వందల కొద్దీ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. కాయితా లంబాడీలను, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో కలిపి 12శాతం రిజర్వేషన్ ఇస్తామనడం ఓటు బ్యాంక్ కోసం కేసీఆర్ వేసుకున్న ఎత్తుగడ. ఇది కేసీఆర్‌, టీఆర్ఎస్ ప్రభుత్వ మోసం. ఇలాంటి మోసకారితరాన్ని పక్కనబెట్టి ఎస్టీ జాబితాలో కొత్తగా ఎవరినీ చేర్చకుండా ఎస్టీలో ఏబీసీడీ వర్గీకరణ చేయాలి.

– వూకె రామకృష్ణ దొర

Updated Date - Sep 14 , 2024 | 05:01 AM

Advertising
Advertising