ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ వారం వివిధ కార్యక్రమాలు 14 10 2024

ABN, Publish Date - Oct 14 , 2024 | 03:58 AM

వేదగిరి రాంబాబు పురస్కారాలు, సుమనశ్రీ సాహితీ సమాలోచన, కతల ముచ్చట్లు, రెండు అనువాదాలు, సుద్దాల పురస్కారం, ‘వంశవృక్షం’ నవలపై ప్రసంగం, కళింగాంధ్ర కవితలు, మొదటి నవలలకు ఆహ్వానం...

వేదగిరి రాంబాబు పురస్కారాలు

వేదగిరి రాంబాబు పురస్కారాల ప్రదానోత్సవం, ‘మా కథలు 2023’ పుస్తకావిష్కరణ సభ అక్టోబర్‌ 14 ఉ.10గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. పుర స్కార గ్రహీతలు కెఎస్వీ రమణమ్మ (బాలసాహిత్య పురస్కా రం), హుమా యూన్‌ సంఘీర్‌ (కథానికా పుర స్కారం). ‘మా కథలు 2023’ను కె.వి. రమణాచారి ఆవిష్కరిస్తారు. సభలో విహారి, బి.ఎస్‌. రాములు, పత్తిపాక మోహన్‌ తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 9849061668.

సింహప్రసాద్‌ సాహిత్యసమితి

సుమనశ్రీ సాహితీ సమాలోచన

కవి సుమనశ్రీ (చెళ్లపిళ్ల కామే శ్వరరావు) సాహితీ సమాలోచన అక్టోబర్‌ 15 సా.6గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగు తుంది. సుమనశ్రీ సాహిత్య జీవన వ్యక్తిత్వం గురించి మిత్రులు పాఠ కులు ఆలోచనలను, జ్ఞాపకాలను కలబోసుకుంటారు. మిత్రులందరికీ ఆహ్వానం.

సుమనశ్రీ మిత్రులు


కతల ముచ్చట్లు

తెలంగాణ రచయితల వేదిక (తె.ర.వే.) కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ప్రాం గణంలో అక్టోబర్ 17 సాయంత్రం ‘138వ ఎన్నీల ముచ్చట్లు’ సాహిత్య కార్యక్రమంలో భాగంగా ఈ విడత ‘కతల ముచ్చట్లు’ కార్యక్రమం జరుగుతుంది. సింగిల్ పేజీ చిన్న కథలతో హాజరు కావాలని రచయి తలకు పిలుపు. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జి.వి. శ్యాం ప్రసాద్ లాల్ ఆతిథ్యంలో ఈ ‘కతల ముచ్చట్లు’ జరుగుతాయి. గాజోజు నాగభూషణం, బి.వి.ఎన్. స్వామి, పుల్లూరి జగదీశ్వరరావు కథలను సమీక్షిస్తారు.

సి. వి. కుమార్

రెండు అనువాదాలు

గీతాహరిహరన్‌ రచనకు ఓల్గా అనువాదం ‘పోటెత్తిన కెరటాన్ని’, ఆకార్‌ పటేల్‌ రచనకు ఎన్‌. వేణు గోపాల్‌ అనువాదం ‘నియంత అంతం’ ఈ రెండు పుస్తకాల ఆవి ష్కరణ సభ మలుపు బుక్స్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 19 సా.6 గంటలకు రవీంద్ర భారతి, హైదరా బాద్‌లో జరుగుతుంది. ఈ పుస్త కాల్ని ఆకార్‌ పటేల్‌, గీతా హరి హరన్‌లు ఆవిష్కరిస్తారు. సభాధ్య క్షత ఎ.కె. ప్రభాకర్‌; వక్తలు కె. శ్రీని వాస్‌, కె.ఎన్‌. మల్లీశ్వరి; నిర్వహణ మలుపు బాల్‌రెడ్డి.

మలుపు బుక్స్‌


సుద్దాల పురస్కారం

సుద్దాల ఫౌండేషన్‌ ప్రకటించిన ‘సుద్దాల హనుమంతు – జానకమ్మ’ జాతీయ పురస్కారాన్ని అరుణోదయ నాగన్న స్వీకరిస్తారు. పురస్కార ప్రదా నోత్సవం అక్టోబర్‌ 19 సా.6గంటలకు సుందరయ్య కళానిలయం, బాగ్‌ లింగంపల్లి, హైదరాబాద్‌లో జరుగు తుంది. ముఖ్య అతిథి జస్టిస్‌ నగేష్‌ భీమపాక; విశిష్ట అతిథులు పిల్లల మర్రి రాములు, సూర్య ధనుంజయ్‌; సభాధ్యక్షులు సుద్దాల సుధాకర్‌ తేజ; స్మారకోపన్యాసం పోరెడ్డి రంగన్న; ఆత్మీయ అతిథి యోచన; స్వాగతం సుద్దాల ప్రభాకర్‌, వందన సమర్పణ చి. ఉన్నత్‌.

సుద్దాల అశోక్‌ తేజ


‘వంశవృక్షం’ నవలపై ప్రసంగం

రాజాం రచయితల వేదిక 117వ సమావేశం అక్టోబర్‌ 20 ఉదయం 10 గంటలకు విజయనగరం జిల్లా, రాజాంలో గల విద్యానికేతన్‌ పాఠ శాలలో జరుగుతుంది. రౌతు గణపతి రావునాయుడు అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో ‘వంశవృక్షం నవల – పరిశీలన’ అంశంపై పొదిలాపు శ్రీనివాసరావు ముఖ్యప్రసంగం చేస్తారు. వివ రాలకు: 98857 58123.

గార రంగనాథం

కళింగాంధ్ర కవితలు

కళింగాంధ్ర ప్రాంతానికి చెందిన కవులు రాసి ఇప్పటికే అచ్చైన దళిత, మత్స్యకార కవితలతో విడివిడి సంకలనాలను ‘చంపావతి ప్రచురణ లు’గా నా సంపాదకత్వంలో తీసుకు వస్తున్నాను. మీ వద్ద ఉన్న పై విభాగాలకు చెందిన కవితలను, వాటి అచ్చైన వివరాలను cha m paavathi@gmail.comకు ఈమెయిల్‌ చేయాల్సిందిగా కోరుతు న్నాను. ఫోన్‌: 96764 93680.

బాలసుధాకర్


మొదటి నవలలకు ఆహ్వానం

అంపశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్ట్‌, వరంగల్‌ నవలాకారుల మొదటి నవలలను ఆహ్వానిస్తున్నది. మొదటి, రెండవ బహుమతులు వరుసగా రూ.10వేలు, రూ.5వేలు. నవల నిడివి ప్రింట్‌లో 100 పేజీలకు తగ్గకుండా, 250పేజీలకు మించకుండా ఉండాలి. 2023 – 2024 మధ్య నవలా రచన జరిగి, పత్రికలలో ప్రచురితం కాని నవలనే, డిటిపి చేయించి మాత్రమే అక్టోబర్‌ 31 తేదీ లోగా పంపాలి. చిరునామా: డి. స్వప్న, 2–7–71, ఎక్సయిజ్‌ కాలనీ, హనుమకొండ, వరంగల్‌ – 506001. ఫోన్‌: 99892 91299.

అంపశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్ట్‌

Updated Date - Oct 14 , 2024 | 03:58 AM