ఈ వారం వివిధ కార్యక్రమాలు 16 12 2024
ABN, Publish Date - Dec 16 , 2024 | 03:54 AM
దొస్తొయేవ్‌స్కీ నవల అనువాదం, ఎరుకల కథా సంపుటి ‘ఏకలవ్య కాలనీ’, శీలా వీర్రాజు తెలుగు ఫాంట్, కవులూ కళాకారులతో కరచాలనం, ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డుల ప్రదానం...
దొస్తొయేవ్‌స్కీ నవల అనువాదం
దొస్తొయేవ్‌స్కీ ‘ద ఇడియట్’ నవలకు వై. వేణు గోపాల్ రెడ్డి అనువాదం ఆవిష్కరణ సభ డిసెంబర్ 18 సా.6గంటలకు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత కుమార్ కూనపరాజు; ఆవి ష్కర్త దాట్ల బాల వెంకటేశవర్మ; ముఖ్య అతిథి గోరటి వెంకన్న; వక్తలు ఎస్. కాత్యాయని, శ్రీనివాసమూర్తి, గుంటూరు లక్ష్మీనరసయ్య, హెచ్చార్కె.
గుర్రం సీతారాములు
ఎరుకల కథా సంపుటి ‘ఏకలవ్య కాలనీ’
పర్‌స్పెక్టివ్స్ ప్రచురణగా వస్తున్న పలమనేరు బాలాజీ కథా సంపుటి ‘ఏకలవ్య కాలనీ’ ఆవిష్కరణ సభ డిసెంబర్ 17 సా.4 గంటలకు సాథి బుక్ స్టాల్, 9బి, బి బ్లాక్, 9th ఫ్లోర్, సామ్రాట్ కాంప్లెక్స్, సైఫాబాద్, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆవిష్కర్తలు– రాగాల వెంకట రాహుల్, ఎన్. వేణుగోపాల్. సభ నిర్వహణ ఎ.కె. ప్రభాకర్. సభలో ఆర్‌కె, కె. శివారెడ్డి, చిన వీరభద్రుడు, యాకూబ్ తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 94409 95010.
పలమనేరు రచయితల సంఘం
శీలా వీర్రాజు తెలుగు ఫాంట్
శీలా వీర్రాజు చేతి రాత ఆధారంగా రూపొందించిన తెలుగు ఫాంట్ ఆవిష్కరణ డిసెంబరు 21 సా.౫.30గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇదే సభలో శీలా సుభద్రాదేవి కవితా సంపుటి ‘మాట్లాడ టానికో మనిషి కావాలి’ ఆవిష్కరణ కూడా జరుగుతుంది. సభలో నందిని సిధారెడ్డి, సుధామ, అమృతలత, పుప్పాల శ్రీరామ్, శీలా సుభద్రాదేవి పాల్గొంటారు
శీలావీ సాహిత్య చిత్రకళావేదిక
కవులూ కళాకారులతో కరచాలనం
వారాల ఆనంద్ ‘కవులూ కళాకా రులతో కరచాలనం’ పుస్తకం ఆవిష్కరణ సభ డిసెంబర్ 21న కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ పీజీ కాలేజీలో జరుగుతుంది. ఆవిష్కర్త పూర్వ ప్రిన్సిపాల్ బి. రాంచందర్ రావు, తొలి కాపీ స్వీకర్త ప్రస్తుత ప్రిన్సిపాల్ కల్వకుంట రామకృష్ణ.
వి. ఇందిరా రాణి
ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డుల ప్రదానం
ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డుల ప్రదానోత్సవం డిసెం బర్ 22 ఉ.10గంటలకు అనంతపురం లోని ఎన్‌జీవో హోమ్‌లో జరుగుతుంది. ముఖ్య అతిథి వాడ్రేవు చినవీర భద్రుడు. ఉమ్మడిశెట్టి అవార్డును బండి సత్యనారాయణ, ఉమ్మడిశెట్టి సతీష్ కుమార్ యువ పురస్కారాన్ని మానస చామర్తి గారు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా రాధేయ కవిత్వం ‘అజేయుడు’ ఆవిష్కరణ ఉంటుంది.
ఉమ్మడిశెట్టి రాధేయ
Updated Date - Dec 16 , 2024 | 03:55 AM