ఈ వారం వివిధ కార్యక్రమాలు 4-11-2024
ABN, Publish Date - Nov 04 , 2024 | 12:22 AM
కాళీపట్నం శత జయంతి సదస్సు, ఖమ్మం ఈస్తటిక్స్ అవార్డు ఫలితాలు...
కాళీపట్నం శత జయంతి సదస్సు
సాహిత్య అకాడమీ – రైటర్స్ అకాడెమీ, విశాఖపట్నం సంయుక్త నిర్వహణలో కాళీపట్నం రామారావు శత జయంతి సదస్సు నవంబర్ 9 ఉదయం 10 గంటల నుంచి అల్లూరి సీతారామరాజు విజ్ఞానకేంద్రం, డాబాగార్డెన్స్, విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ సందర్భంగా కాళీపట్నంపై మోనోగ్రాఫ్‌ను కె. శ్రీనివాసరావు ఆవిష్కరిస్తారు. అధ్యక్షత సి. మృణాళిని, గౌరవ అతిథి వి.వి. రమణమూర్తి, కీలకోపన్యాసం వివిన మూర్తి. సభలో ప్రసాద వర్మ ‘కాళీపట్నం కథల్లో రాజకీయ సాంఘికాంశాలు’, కె.ఎన్. మల్లీశ్వరి ‘కాళీపట్నం కథల్లో కుటుంబ సంబంధాలు’, జి. వెంకటకృష్ణ ‘కాళీపట్నం కథా శిల్పం’, జి.ఎస్. చలం ‘కాళీపట్నం వ్యాసాలు’, దాసరి రామచంద్రరావు ‘కథా నిలయం- కాళీపట్నం రామారావు’, డి. హరనాథ్ (అర్నాద్) ‘గురువుగా కాళీపట్నం’ అంశాలపై ప్రసంగిస్తారు.
సాహిత్య అకాడమీ
ఖమ్మం ఈస్తటిక్స్ అవార్డు ఫలితాలు
ఖమ్మం ఈస్తటిక్స్ సాహిత్య పోటీలో కవిత్వ విభాగంలో జూకంటి జగన్నాథం కవితా సంపుటి ‘ఒక కప్పు చాయ్ నాలుగు మెసేజ్‌లు’ రూ.40వేల బహుమతికి ఎంపిక కాగా, రాళ్ళబండి శశిశ్రీ ‘అనుమంద్రం’, తెలుగు వెంకటేష్ ‘కబోధి చేపల కబుర్లు’ ప్రత్యేక ప్రశంసకు ఎంపికయ్యాయి. ఎన్. గోపి కవితా సంపుటి ‘క్రియ ఒక జీవన లయ’ విశిష్ట పురస్కారానికి ఎంపికైంది. కథల విభాగంలో కె.వి. మన్ ప్రీతమ్ రూ.25వేల ప్రథమ, సయ్యద్ గఫార్ రూ.15వేల ద్వితీయ, కరీం రూ.10వేల తృతీయ బహు మతులు గెలుచుకున్నారు. ఈ కథలతో మరో తొమ్మిది కథలు కలిపి సంపుటిగా ప్రచురిస్తాం. వీటి రచయితలు– జి. ఉమా మహేశ్వర్, సింహప్రసాద్, వేల్పుల నారాయణ, రాజా నరసింహ, రోహిణి వంజారి, సుగుణారావు, శాంతి ప్రబోధ, పి. కిషన్, శివ ప్రసాద్. డిసెంబర్ 15న ఖమ్మంలో పురస్కార ప్రదానం.
రవి మారుత్
Updated Date - Nov 04 , 2024 | 12:22 AM