ఈ వారం వివిధ కార్యక్రమాలు 02 06 2024
ABN, Publish Date - Jun 03 , 2024 | 05:48 AM
‘ధిక్కార’ మహాత్మాపూలే స్ఫూర్తి కవిత్వం, పాతూరి మాణిక్యమ్మ అవార్డు, కథలు కవితల పోటీ...
‘ధిక్కార’ మహాత్మాపూలే స్ఫూర్తి కవిత్వం
నెలపొడుపు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘ధిక్కార’ మహాత్మా పూలే స్ఫూర్తి కవిత్వం ఆవిష్కరణ సభ జూన్ 8 ఉదయం 10గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆహ్వానం పి. వహీద్ ఖాన్; సభాధ్యక్షులు సంగిశెట్టి శ్రీనివాస్; ముఖ్య అతిథి, పుస్తక ఆవిష్కర్త బుర్ర వెంకటేశం; విశిష్ట అతిథులు గోరటి వెంకన్న, జూలూరు గౌరీ శంకర్, జి. లక్ష్మీనరసయ్య, మామిడి హరికృష్ణ, బి. ప్రసాదమూర్తి, ఏ. జయంతి, పసునూరి రవీందర్ తదితరులు పాల్గొంటారు.
కందికొండ మోహన్
పాతూరి మాణిక్యమ్మ అవార్డు
పాతూరి మాణిక్యమ్మ సార్మక సాహిత్య పురస్కారం కోసం 2023లో ప్రచురితమైన కవితా సంపుటాలను కవయిత్రుల నుంచి మాత్రమే ఆహ్వానిస్తు న్నాం. పోటీలో గెలుపొందిన కవయిత్రికి రూ.5వేల నగదు బహుమతితోపాటు ఘనంగా సన్మానం ఉంటుంది. మీ స్వీయ కవితా సంపుటాలు రెండు కాపీలను జూలై 30లోగా చిరునామా: పాతూరి అన్నపూర్ణ, 1156/ 28-1, ప్రశాంతి నగర్, నవలాకుల గార్డెన్స్, నెల్లూరు - 524002, ఏపీ, ఫోన్: 94902 30939కు పంపాలి.
పాతూరి అన్నపూర్ణ
కథలు కవితల పోటీ
‘వురిమళ్ల ఫౌండేషన్-అక్షరాల తోవ’ నిర్వహిస్తున్న పోటీలో కథలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.5వేలు, 4వేలు, 3వేలు; కవితలకు రూ.4వేలు, 3వేలు, 2వేలు. రెండు విభాగాల్లో రూ.1000 చొప్పున రెండేసి కన్సొలేషన్ బహుమతులు. వీటితోపాటు ఖమ్మం జిల్లాలో సాహిత్యంలో కృషి చేస్తున్న వారికి భోగోజు పురుషోత్తం - సముద్రమ్మ సాహితీ పురస్కారం అందజేస్తారు. రచనలను జూన్ 30లోగా చిరునామా: రాచమళ్ళ ఉపేందర్, స్టార్ ఆఫ్‌సెట్ ప్రింటర్స్, శాంతి లాడ్జ్ ఎదురుగా, స్టేషన్ రోడ్, ఖమ్మం - 507 001, ఫోన్: 9849 277968.
వురిమళ్ల సునంద
Updated Date - Jun 03 , 2024 | 05:48 AM