ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఈ వారం వివిధ కార్యక్రమాలు 05 05 2024

ABN, Publish Date - May 06 , 2024 | 01:25 AM

‘వేదిక’ సాహిత్య సమావేశం, అమృతలత - అపురూప అవార్డ్స్‌, గీతమ్‌ పురస్కారం, చెన్నమనేని రంగనాయకమ్మ అవార్డ్‌...

‘వేదిక’ సాహిత్య సమావేశం

‘వేదిక’‘ ఆధ్వర్యంలో మే 11 సాయంత్రం జరగనున్న గూగుల్‌ మీట్‌ ఆన్‌లైన్‌ సమావేశంలో వి వి గనేశనందన్‌ రాసిన ఆంగ్ల నవల ‘Brotherless Night’ను స్వప్న పేరి పరిచయం చేస్తారు. తర్వాత వెంకట్‌ ఈశ్వర్‌ కథ ‘ఋతుపవనం’ మీద చర్చ వుంటుంది. వివరాలకు: 81426 42638

అనిల్‌ అట్లూరి

అమృతలత - అపురూప అవార్డ్స్‌

అమృతలత - అపురూప అవార్డ్స్‌ కార్య క్రమం మే 19 సాయంత్రం 4.15 నుంచి ఎన్‌.టి.ఆర్‌. ఆడిటోరియం, తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్‌లో జరుగు తుంది. ముఖ్య అతిథి వోలేటి పార్వతీశం, విశిష్ట అతిథి అలేఖ్య పుంజాల, ఆత్మీయ అతిథి తులసి. అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను కె.వి. కృష్ణకుమారి, ఆలూరి విజయలక్ష్మి అందుకుంటారు. అపురూప అవార్డులను జి.ఎస్‌. లక్ష్మి, సిహెచ్‌ సుశీలమ్మ, శివలక్ష్మి, సావేరి దుర్గాభవాని, సమతా రోష్ని, నండూరి సుందరీ నాగమణి, కొండపల్లి నీహారిణి, జ్యోతిర్మయి, అంజనీ యలమంచిలి, గీత హజారే, ప్రేమ మాలిని, దేవనపల్లి వీణావాణి అందుకుంటారు.

టి. వసంత

గీతమ్‌ పురస్కారం

గీతమ్‌ సంస్థ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ కవితా సంపుటా లను ఎంపిక చేసి ‘గీతమ్‌ పురస్కారం’ ఇస్తున్నాం. అత్యుత్తమ సంపుటికి రూ. 10116/- నగదు, జ్ఞాపికతో పురస్కారం ఉంటుంది. 2016-2024 మధ్య కాలంలో విడుదలైన సంపుటాలను మూడు కాపీ లను చిరునామా: గీతమ్‌ సాహితీ సంస్థ, పిఠాపురం - 533450, ఫోన్‌: 98483 98240కు పంపాలి.

ఓలేటి వెంకటేశ్వర రావు

చెన్నమనేని రంగనాయకమ్మ అవార్డ్‌

శ్రీలేఖ సాహితి, వరంగల్‌ ఆధ్వర్యంలో చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక విశి ష్టాద్వైత జాతీయ సాహిత్య పురస్కార సభ మే 12 సాయంత్రం 5గంటలకు ముప్పవరపు వెంకయ్య నాయుడు స్వ గృహం, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. ముఖ్య అతిథి- మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు; సభాధ్యక్షులు- రేవూరి అనంత పద్మనాభరావు; సత్కారములు- శ్రీదేవి మురళీధర్‌, వైష్ణవ వేంకటరమణమూర్తి, గార రంగనాథం. ‘శ్రీభాష్యము-కర దీపిక’, ‘వేదాంత దేశికులు-హంస సందేశము’ పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది.

శ్రీలేఖ సాహితి

Updated Date - May 06 , 2024 | 01:42 AM

Advertising
Advertising