ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ వారం వివిధ కార్యక్రమాలు 05 08 2024

ABN, Publish Date - Aug 05 , 2024 | 12:41 AM

కొత్తపల్లి జయశంకర్‌ స్ఫూర్తి పురస్కారం, కథలకు ఆహ్వానం, ‘జుడుగుడు’ కవితా సంపుటి, ఇంద్రగంటి సాహితీ పురస్కారం, నవలలకు ఆహ్వానం...

కొత్తపల్లి జయశంకర్‌ స్ఫూర్తి పురస్కారం

తెలంగాణ రచయితల వేదిక గత ఐదేళ్ళుగా ప్రదానం చేస్తున్న ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్ఫూర్తి పురస్కార ప్రదానం ఆగస్ట్ 6 సా.6గంటలకు సుందర య్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్‌లో జరుగుతుంది. పురస్కారాన్ని మాడభూషి శ్రీధర్ స్వీకరిస్తారు.వివరాలకు: 94915 98040

బూర్ల వేంకటేశ్వర్లు

కథలకు ఆహ్వానం

బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్‌ – విశాఖ సంస్కృతి మాస పత్రిక కథల పోటీని నిర్వహిస్తున్నాయి. ఏ4 సైజ్‌ పేజీలపై చేతి వ్రాతలో ఐదు పేజీలు, డిటిపిలో నాలుగు పేజీలు దాటరాదు. ఎంపికైన ఆరు కథలకు రూ.2,500 నగదు బహుమతి. కథలను ఆగస్ట్‌ 24లోగా చిరునామా: బండికల్లు జమదగ్ని, 402, హిమజ టవర్స్, 3/10, బ్రాడీ పేట, గుంటూరు–522002కు పంపాలి. మరిన్ని వివరాలకు: 9848264742.

బండికల్లు జమదగ్ని

‘జుడుగుడు’ కవితా సంపుటి

ప్రతాప్ రాజులపల్లి కవితా సంపుటి ‘జుడుగుడు’ ఆవిష్కరణ సభ ఆగస్టు 6 సా.6గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగు తుంది. కార్యక్రమంలో కట్టా నరసింహా రెడ్డి, తంగెడ కిషన్ రావు, కుప్పిలి పద్మ, సంగెవేని రవీంద్ర, సమ్మెట నాగమల్లేశ్వరరావు పాల్గొం టారు.

గజ్జెల అశోక్ రెడ్డి

ఇంద్రగంటి సాహితీ పురస్కారం

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం 2024 సంవత్సరానికి కవి అఫ్సర్‌ స్వీకరిస్తారు. పురస్కార ప్రదానం ఆగస్టు 14 సా.6గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ బహుమానంలో భాగంగా రూ.25వేల నగదు, జ్ఞాపిక బహూకరణ జరుగుతుంది.

ఇంద్రగంటి జానకీబాల

నవలలకు ఆహ్వానం

అరసం వరంగల్ ప్రతి ఏటా ఒక్కో సాహిత్య ప్రక్రియకు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం ప్రదానం చేస్తున్నారు. 2024కు గాను నవలలకు ప్రదానం చేస్తారు. 2020 జూలై – 2024 జూన్ మధ్య మొదటి ముద్రణ జరిగిన నవలలు నాలుగు ప్రతులను ఆగస్టు 31లోగా చిరునామా: నిధి, ఇంటి నెంబర్ 2–4–1449, అశోక కాలనీ, హనమకొండ – 506001, ఫోన్‌: 97010 00306 కు పంపాలి. ఎంపికైన రచయితకు అక్టోబర్ 2024లో హనుమకొండలో రూ.5వేల- నగదు, శాలువా, జ్ఞాపికతో పురస్కారం ప్రదానం ఉంటుంది.

పల్లేరు వీరస్వామి

Updated Date - Aug 05 , 2024 | 12:41 AM

Advertising
Advertising
<