ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ వారం వివిధ కార్యక్రమాలు 08 07 2024

ABN, Publish Date - Jul 08 , 2024 | 05:41 AM

‘నల్లకొడిసె వన్నెకాడు’ కవిత్వం, ‘గ్రేయిన్‌ చైన్స్‌’ ఆంగ్ల అనువాద కవిత్వం, ‘అన్వేషణ’ సాహిత్య వ్యాసాలు, దళిత సంస్కృతి, సాహిత్యాలపై సదస్సు...

‘నల్లకొడిసె వన్నెకాడు’ కవిత్వం

నాగిళ్ళ రమేష్‌ కవితాసంపుటి ‘నల్లకొడిసె వన్నెకాడు’ ఆవిష్కరణ జూలై 14 సా.6గంటలకు రవీంద్రభారతి మినీహాల్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత- కవి యాకూబ్‌, ఆవిష్కరణ- కె. శివారెడ్డి, తొలిప్రతి స్వీకర్త- నాగిళ్ళ సదానందం, అంకితం- జబ్బు వెంకటేష్‌, ముఖ్య అతిథి- మామిడి హరికృష్ణ, వక్త- కోయి కోటేశ్వరరావు. ఆత్మీయ స్పందనలు- పల్లిపట్టు నాగరాజు, తగుళ్ళ గోపాల్‌, నరేష్కుమార్‌ సూఫీ, వనపాకల దిలీప్‌, పేర్ల రాము, గుర్రాల అనూష, లిఖిత్‌ కుమార్‌ గోదా.

కవిసంగమం

‘గ్రేయిన్‌ చైన్స్‌’ ఆంగ్ల అనువాద కవిత్వం

అన్నవరం దేవేందర్‌ ఆంగ్ల అనువాద కవితా సంపుటి ‘గ్రేయిన్‌ చైన్స్‌’ ఆవిష్కరణ సభ జూలై 14 ఉ.10 గంటలకు కరీంనగర్‌ ఫిలిం భవన్‌లో జరుగుతుంది. ఆవిష్కర్త- బి. నరసింగరావు, అధ్యక్షత- బూర్ల వెంకటేశ్వర్లు. నలిమెల భాస్కర్‌, ఎనిశెట్టి శంకర్‌, జీవి శ్యాం ప్రసాద్‌ లాల్‌, నగునూరి శేఖర్‌, పొన్నం రవిచంద్ర, సవ్యసాచి గాజోజు నాగభూషణం, నంది శ్రీనివాస్‌ తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 94402 38852.

మాడిశెట్టి గోపాల్‌

‘అన్వేషణ’ సాహిత్య వ్యాసాలు

తూర్పు మల్లారెడ్డి సాహిత్య వ్యాసాల పుస్తకం ‘అన్వేషణ’ ఆవిష్కరణ సభ జూలై 12 సా.6గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ముఖ్య అతిథి, ఆవిష్కర్త- నందిని సిధారెడ్డి, సభాధ్యక్షులు నాళేశ్వరం శంకరం, గ్రంథ సమీక్ష- వి. శంకర్‌, ఆప్త వాక్యం- ఏనుగు నరసింహారెడ్డి, మామిడి హరికృష్ణ.

కందుకూరి శ్రీరాములు

దళిత సంస్కృతి, సాహిత్యాలపై సదస్సు

‘దళిత చరిత్ర - సంస్కృతి - సాహిత్యం - పునర్మూల్యాంకనం - ఖాళీల పూరింపు’ అంశంపై రౌండ్‌ టేబుల్‌ సదస్సు జూలై 14 ఉ.10గంటల నుంచి 2 గంటల వరకు తెలుగు యూనివర్సిటి కాన్ఫరెన్స్‌ హాల్‌, హైదరాబాద్‌లో జరు గుతుంది. గుడిపల్లి నిరంజన్‌, దార్ల వెంకటేశ్వరరావు, ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొంటారు ఈ సందర్భంగా సంగిశెట్టి శ్రీనివాస్‌ రచించిన ‘ఇమానం’ విస్మృత దళిత చైతన్యం, ‘దళితోద్యమ వేగుచుక్క భాగ్యారెడ్డి వర్మ పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది.

ఫూలే అంబేద్కర్‌ అధ్యయన వేదిక

కథా సంధి

సాహిత్య అకాడెమీ, సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో ‘కథా సంధి’ కార్యక్రమంలో గంటేడ గౌరు నాయుడు తమ కథ చదివి ఆహూ తులతో ముచ్చటిస్తారు. ఈ కార్య క్రమం జూలై 14 సా.5.30గంటలకు జిల్లా పరిషత్‌ మినిస్టీరియల్‌ హాల్‌, విజయనగరంలో జరుగుతుంది.

సాహితీ స్రవంతి

‘వీధిచుక్కలు’ కవితా సంకలనం

కొసరాజు సామ్రాజ్యం సంపాదకత్వంలో ప్రచురించిన ‘వీధి చుక్కలు’ కవితా సంకలనం ఆవిష్కరణ జూలై 14న హైదరాబాద్‌ మోహన్‌ నగర్‌లోని కొసరాజు ఆర్తి ్క్ష జాహ్నవి మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ హాల్లో జరుగుతుంది. సభలో యస్‌.వి. రామారావు, రమణ వెలమకన్ని, వై. రామకృష్ణారావు తదితరులు పాల్గొంటారు.

పొత్తూరి సుబ్బారావు

Updated Date - Jul 08 , 2024 | 05:41 AM

Advertising
Advertising
<