ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ వారం వివిధ కార్యక్రమాలు 12 08 2024

ABN, Publish Date - Aug 12 , 2024 | 01:09 AM

బాలల నవలలకు ఆహ్వానం, మద్దూరి నగేష్‌ బాబు సమగ్ర కవిత్వం, ‘విమర్శకునితో ఒక సాయంత్రం’, ‘పాయిదరువులు’ నవల, ‘యాదొంకీ బారాత్’ ఆవిష్కరణ, కవి సంధి...

బాలల నవలలకు ఆహ్వానం

తానా–మంచి పుస్తకం ఆధ్వర్యంలో బాలల నవలలకు ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రచనలు నవల, సచిత్ర నవల లేదా కామిక్‌ స్ట్రిప్‌/ గ్రాఫిక్‌ నవల, కథా గుచ్ఛం రూపంలో ఉండాలి. (కథా గుచ్ఛంలో పాత్రలు మారకుండా కథలు స్వతంత్ర ఎపి సోడ్‌లలాగ ఉండాలి). మోడ్రన్‌ డే అడ్వెంచర్‌, మిస్టరీ, హాస్యం, సైన్స్‌ ఫిక్షన్‌, కమింగ్‌ ఆఫ్‌ ఏజ్‌ అంశాలను తీసుకుని రాయవచ్చు. నవంబర్‌ 30, 2024లోపు అం దేలా రచనలు పంపాలి. యూనికోడ్‌/ అను ఫాంట్‌లలో టైప్‌చేసిన ప్రతుల్ని tana.mp.balalanavalalu2025@gmail.comకు పంపాలి. రాతప్ర తులను చిరునామా: మంచి పుస్తకం, 12–13–439, వీధి నెం.1, తార్నాక, సికింద్రా బాద్‌ 500017కు పంపాలి. వివరాలకు: పి భాగ్యలక్ష్మి 94907 46614, వాసిరెడ్డి నవీన్‌ 98493 10560కు ఫోన్‌ చెయ్యవచ్చు. ఎంపికైన రచనలను తానా – మంచి పుస్తకం కలిసి ప్రచురిస్తాయి.

జంపాల చౌదరి

మద్దూరి నగేష్‌ బాబు సమగ్ర కవిత్వం

ఖాజా, కోయి కోటేశ్వర రావు సంపాద కత్వంలో బహుజన కెరటాలు ప్రచురిం చిన మద్దూరి నగేష్‌ బాబు సమగ్ర కవిత్వం ఆవిష్కరణ మద్దూరి జయంతి సందర్భంగా ఆగస్ట్‌ 15 సా.5గంటలకు ఒంగోలు, మల్లయ్య లింగం భవన్‌లో జరుగుతుంది. అధ్యక్షత ఆత్మకూరి బాలచెన్నయ్య, ముఖ్య అతిథి యం.యం. వినోదిని, వక్తలు కత్తి కళ్యాణ్‌, ఎజ్రా శాస్త్రి, నూకతోటి రవికుమార్‌, శ్రీరామకవచం సాగర్‌, సజ్జా వెంకటేశ్వర్లు, గంగవరపు సునీత తదితరులు.

పల్నాటి శ్రీరాములు


‘విమర్శకునితో ఒక సాయంత్రం’

కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆగస్ట్‌ 17 సా.6 గంటలకు విజయవాడలో విమర్శకులు జి. లక్ష్మీనర్సయ్యతో ‘విమర్శకునితో ఒక సాయంత్రం’ కార్యక్రమం జరుగుతుంది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సెమినార్ హాల్‌లో జరిగే ఈ ముఖాముఖి కార్యక్రమానికి సాహిత్యాభిమానులు అందరూ ఆహ్వానితులే.

సి. మృణాళిని

‘పాయిదరువులు’ నవల

కె.వి. మేఘనాథ్ రెడ్డి రాసిన ‘పాయిదరువులు’ నవల ఆవిష్కరణ సభ ఆగస్ట్ 17 ఉ.10గంటలకు తిరుపతిలోని ఛాంబరాఫ్ కామర్స్ లో జరుగుతుంది. సభలో మధురాంతకం నరేంద్ర, పలమనేరు బాలాజీ, ఆర్.సి.కె రాజు, సి.ఎన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొంటారు.

భాగ్య

‘యాదొంకీ బారాత్’ ఆవిష్కరణ

వారాల ఆనంద్ తన జ్ఞాపకాలను ‘యాదొంకీ బారాత్’ పుస్తకంగా రాసారు. ఈ పుస్తకావిష్కరణ ఆగస్ట్‌ 18 సా.4గంటలకు హైదరాబాద్ ఉస్మానియా యునివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో జరుగుతుంది.

ఇందిరా రాణి

కవి సంధి

సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో ‘కవి సంధి’ కార్యక్రమంలో నగ్నముని తన కవితలను చదివి, పాఠకులతో సంభాషిస్తారు. ఈ కార్యక్రమం ఆగస్ట్‌ 21 సా.5గంటలకు రవీంధ్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది.

సాహిత్య అకాడెమీ

Updated Date - Aug 12 , 2024 | 01:09 AM

Advertising
Advertising
<