ఈ వారం వివిధ కార్యక్రమాలు 17 06 2024
ABN, Publish Date - Jun 17 , 2024 | 03:01 AM
కవితాసంపుటాలకు ఆహ్వానం, ఆచార్య ఎన్.జి. రంగ సాహిత్యపురస్కారం, ‘మాటల చెట్టు’ కవితాసంపుటి ఆవిష్కరణ, ఖమ్మం ఈస్థటిక్స్ - రచనల ఆహ్వానం, హాసిని రామచంద్ర లిటరరీ ఫౌండేషన్ (హెచ్‌ఆర్‌సి) కథలు, కవితల పోటీలు, పాలపిట్ట దాశరథి శతజయంతి సంచిక కోసం రచనల ఆహ్వానం...
కవితాసంపుటాలకు ఆహ్వానం
విమలా స్మారక ‘విమలాశాంతి సాహిత్య పురస్కారం - 2024’ కోసం కవుల నుండి 2022, 2023 సంవత్సరాలలో ప్రచు రించబడిన వచన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. కవులు తమ కవితా సంపుటాలు నాలుగేసి కాపీలను జూలై 15 లోగా చిరునామా: ఉప్పరపాటి వెంకటేశులు, 16-37-1, రాహుల్ నివాస్, ప్రశాంతినగర్, అనంతపురం - 515004కు పంపాలి.
శాంతి నారాయణ
ఆచార్య ఎన్.జి. రంగ సాహిత్యపురస్కారం
ఎన్.జి.రంగ సాహిత్య పురస్కారం-2024 కోసం 2021-2023 మధ్య ప్రచురితమైన రచయిత్రుల నవలలను జులై 20 లోపు నాలుగు ప్రతులను చిరునామా: నాగభైరవ ఆదినారాయణ, 202, శ్రీ వెంకటసాయి రెసిడెన్సీ, రామయ్యనగర్, ఒంగోలు - 523002కు పంపాలి. నవలల్లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన నవలలకు రూ.10వేలు, రూ.5వేలు చొప్పున బహుమతులు ఉంటాయి. మరిన్ని వివరాలకు: 9849799711.
ఆదినారాయణ
‘మాటల చెట్టు’ కవితాసంపుటి ఆవిష్కరణ
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ-తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ ఆధ్వర్యంలో గడ్డం సులోచన రాసిన ‘మాటల చెట్టు’ కవితా సంపుటిని జూన్ 22 ఉ.10గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆవిష్కరణ నందిని సిధారెడ్డి, అధ్యక్షత కందుకూరి శ్రీరాములు. సభలో నాళేశ్వరం శంకరం, ఉదారి నారాయణ తదితరులు పాల్గొంటారు.
తెలంగాణ రచయితల సంఘం (జంటనగరాలు)
ఖమ్మం ఈస్థటిక్స్ - రచనల ఆహ్వానం
ఖమ్మం ఈస్థటిక్స్ పేరిట ప్రతి యేటా ఒక ఉత్తమ కవితా సంపుటికి, మూడు ఉత్తమ కథలకు ఇచ్చే పురస్కారాలకు ఇదే ఆహ్వానం. మూడు ఉత్తమ కథలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ పురస్కారాలు ఇస్తూ (వీటి బహుమతులు వరుసగా: రూ.25వేలు, 15వేలు, 10వేలు), మరికొన్ని కథలను కూడా సాధారణ ప్రచురణకు ఎంపిక చేసి పుస్తకంగా అచ్చువేస్తాం. ఉత్తమ కవితా సంపుటికి రూ.40 వేల రూపాయల నగదు బహుమతి ఉంటుంది. కవితా సంపుటి 2023 ఏప్రిల్, 2024 మార్చ్ నడుమ ప్రచురితమై ఉండాలి. సంపుటి కనీసం 25 కవితలకు తగ్గకుండా ఉండాలి. పురస్కారం కోసం నాలుగు ప్రతులను పంపాలి. పోటీకి పంపే కథలు కేవలం ఈ పురస్కారం కోసం మాత్రమే రాసినవై ఉండాలి. కథ ప్రింట్ నాలుగు ప్రతులను పోస్టులో పంపి, ఈమెయిల్‌కు యూనికోడ్ సాఫ్ట్ కాపీ కూడా పంపాలి. ఖమ్మంలో నవంబర్‌లో జరిగే వేడుకలో అవార్డుల ప్రదానం ఉంటుంది. కథలు, కవితా సంపుటులు ఆగస్ట్ 31, 2024 లోపు పంపాల్సిన చిరునామా: ఖమ్మం ఈస్థటిక్స్, హార్వెస్ట్ స్కూల్, 5-7-200/11, పాకబండ బజార్, ఖమ్మం - 507002. ఫోన్: 9849114369. ఈమెయిల్: khammamaesthetics@gmail.com
ఖమ్మం ఈస్థటిక్స్
హాసిని రామచంద్ర లిటరరీ ఫౌండేషన్ (హెచ్‌ఆర్‌సి) కథలు, కవితల పోటీలు
హెచ్‌ఆర్‌సి కథల, కవితల పోటీ కోసం ప్రయోజనాత్మక అంశాలతో రచనలను జూన్ 25లోగా 9502818774 నంబరుకు వాట్స్‌అప్‌తోపాటు నాలుగు ప్రతు లను చిరునామా: తోట సుభాషిణి, ఇం.నెం. 15-13-309, బ్యాంకు కాలనీ, ఖమ్మం- 507002కు పంపాలి.
సుభాషిణి తోట
పాలపిట్ట దాశరథి శతజయంతి సంచిక కోసం రచనల ఆహ్వానం
ఈ ఏడాది జూలై 22న దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి సంవత్సరం ఆరంభమవుతున్న సందర్భంగా దాశరథి శతజయంతి సంచికని తెస్తున్నాం. ఇందుకోసం దాశరథి కృష్ణమాచార్యులతో అనుబంధం గలవారు వారితో తమ జ్ఞాపకాలు, సాహిత్య సంబంధాల గురించి వ్యాసాలను, ముఖ్యంగా దాశరథి పాల్గొన్న సభల ఫోటోలను, వారితో ఉన్న తమ ఫోటోలను, దాశరథి రాసిన ఉత్తరాలను చిరునామా: ఎడిటర్, పాలపిట్ట, ఫ్లాట్ నెం: 2, ఎం.ఐ.జి-2, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్- 500044కు పంపగోరుతున్నాము. ఫోన్: 9490099327, ఈమెయిల్: palapittabooks@gmail.com
పాలపిట్ట
Updated Date - Jun 17 , 2024 | 03:05 AM