ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఈ వారం వివిధ కార్యక్రమాలు 20 05 2024

ABN, Publish Date - May 20 , 2024 | 03:12 AM

దాసరి శిరీష జ్ఞాపికకు రచనల ఆహ్వానం,కథా సదస్సుకు ఆహ్వానం, పల్లా జాతీయ కవితా పురస్కారం, రాజాం రచయితల వేదిక సమావేశం, లక్షల కాపీల కవితా సమాహారం, ఎమ్మెస్సార్‌ జాతీయ స్థాయి కథల పోటీ 2024...

రాజాం రచయితల వేదిక సమావేశం

మే 26 ఉ.10గంటలకు విజయనగరం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్‌ పాఠశాలలో ‘శ్రీపాద కథల్లో సామాజిక జీవనం’ అంశంపై రాజాపు శాంతారావు ప్రసంగిస్తారు.

రాజాం రచయితల వేదిక

పల్లా జాతీయ కవితా పురస్కారం

యువసాహితి ప్రకటించిన పల్లా జాతీయ కవితా పురస్కారానికి 2024కి కంచరాన భుజంగరావు రచించిన ‘నీటిగింజల పంట’ కవితా సంపుటి ఎంపికైంది. జూన్‌ మొదటి వారంలో ప్రొద్దుటూరులో బహుమతి సత్కారం ఉంటుంది.

పల్లా కృష్ణ

దాసరి శిరీష జ్ఞాపికకు రచనల ఆహ్వానం

దాసరి శిరీష జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు ఎంపిక చేసిన ఒక రచనను ముద్రించి ఆ పుస్తకాలను ప్రతి ఏటా సెప్టెంబర్‌ 3న రచయితకు అందిస్తున్నారు. ఇందుకు మీ కథ/ కవిత్వం/ నవల/ జీవిత చరిత్ర/ ఆత్మ కథ సారాంశాన్ని జూన్‌ 5లోగా ఒక ఏ4 పేజీని మించకుండాdasarisireeshagnaapika2024@gmail.comకు పంపాలి. సినాప్సిస్‌ యూనికోడ్‌ లేదా పిడిఎఫ్‌ ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలి. ఏ ప్రక్రియకు చెందిన రచన అయినా 200 పేజీలు మించకుండా ఉండాలి. స్వీయ పరిచయంతో పాటు ఫోన్‌ నంబర్‌, చిరునామా కూడా మెయిల్‌ చేయాలి. కొత్త తరం రచయితలకు ప్రాధాన్యం ఉంటుంది.

అపర్ణ తోట


కథా సదస్సుకు ఆహ్వానం

తూర్పు గోదావరి జిల్లా రచయితల సంఘం, కాకినాడ, ఆంధ్ర ప్రదేశ్‌, జూన్‌ 9న నిర్వహించే ఒకరోజు కథా సదస్సులో పాల్గొనడానికి వర్ధమాన తెలుగు కథకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. రిజిస్ట్రేషన్‌ వివరాల కోసం జి.వి.కె. వర్మ- 9866145951 నంబర్‌లో సంప్రదించాలి. అభ్యర్థులు మే 25 లోపల పది పేజీలకు మించని కొత్త, అముద్రిత కథ పిడిఎఫ్‌ను అద్దేపల్లి ప్రభు వాట్సాప్‌ నంబర్‌ 98489 30203కి, ఓపెన్‌ ఫైల్‌ను prabhukkd@gmail. comకు పంపాలి. సదస్సులో తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి, వాసిరెడ్డి నవీన్‌, అట్టాడ అప్పల నాయుడు, ఆలూరి విజయ లక్ష్మి, మహమ్మద్‌ ఖదీర్‌ బాబు, పెద్దింటి అశోక్‌ కుమార్‌, దాట్ల దేవదానం రాజు, శిఖామణి, వేంపల్లి షరీఫ్‌, జాన్సన్‌ చోరగుడి, జి. వెంకట కృష్ణల ప్రసంగాలు ఉంటాయి.

దాట్ల దేవదానం రాజు

లక్షల కాపీల కవితా సమాహారం

పాఠశాలలు కళాశాలల్లో చదివే విద్యార్థులను సాహిత్యం వైపు ఆహ్వానించేందుకు, మరో గ్రంథాలయ ఉద్యమ మహా ప్రయత్నం దిశగా విద్యార్థుల కోసం ఇప్పటివరకు ప్రముఖ కవులు రాసిన వచన కవితలను సూచించండి. మీరు రాసిన అచ్చయిన కవితలను పంపించండి. కవితలను studentspoetrybook2024@ gmail.comకు ఈమెయిల్‌ చేయండి. వివరాలకు: 9440995010.

పలమనేరు బాలాజీ


ఎమ్మెస్సార్‌ జాతీయ స్థాయి కథల పోటీ 2024

మలిశెట్టి సీతారామ్‌ స్మారకార్థం నిర్వహిస్తున్న కథల పోటీకి రచయితల నుండి కథలను ఆహ్వానిస్తున్నాం. బహుమతి పొందిన కథలతో బాటు మరికొన్ని ఎంపిక చేసిన ఉత్తమ కథలతో ‘కథా ప్రపంచం 2024’ పుస్తకం తెస్తాం. కమిటీ ఎంపిక చేసే సాహితీవేత్తకు మలిశెట్టి సీతారామ్‌ స్మారక సాహితీ పురస్కారం 2024 అంద చేయబడుతుంది. కథలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు. కథలను జూన్‌ 30 లోగా ఈమెయిల్‌ msreducaionalsociety@ gmail. comకు పంపాలి. వివరాలకు: 93947 82540

మలిశెట్టి శ్యాం ప్రసాద్‌

Updated Date - May 20 , 2024 | 03:12 AM

Advertising
Advertising