ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ వారం వివిధ కార్యక్రమాలు 23 09 2024

ABN, Publish Date - Sep 23 , 2024 | 12:15 AM

‘సబ్బని సాహిత్య వ్యాసములు’, ‘లోపలి వాన’ కవితా సంపుటి, విమలా శాంతి కవితా పురస్కారం, ఉడాలి నరసింహశాస్త్రి వైదుష్యం, సాంఘిక నవలల పోటీ...

‘సబ్బని సాహిత్య వ్యాసములు’

సబ్బని లక్ష్మీనారాయణ రాసిన సాహిత్య వ్యాసాల పుస్తకం ఆవిష్కరణ సభ సెప్టెంబర్‌ 23 సా.5.30నిమిషాలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగు తుంది. సభలో కె.వి. రమణాచారి, బైస దేవదాస్‌, మామిడి హరికృష్ణ, ఏనుగు నరసింహారెడ్డి, దార్ల వెంకటేశ్వరరావు, సంకెనపల్లి నాగేంద్ర శర్మ తదితరులు పాల్గొంటారు.

మానస ఆర్ట్ థియేటర్స్‌

‘లోపలి వాన’ కవితా సంపుటి

కుడికాల వంశీధర్ ‘లోపలి వాన’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 29 ఉ.10గం.లకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగు తుంది. సభలో ఎన్‌. గోపి, సూర్యా ధనుంజయ్, ఎస్. రఘు, గిన్నారపు ఆది నారాయణ తదితరులు పాల్గొంటారు.

మద్దాళి రఘురాం

విమలా శాంతి కవితా పురస్కారం

విమలా శాంతి కవితా పురస్కారానికి 2024కి గాను ‘అమ్మకు ఓ జత చెప్పులు కొనాలి’ కవితా సంపుటి రాసిన లేదాళ్ల రాజేశ్వరరావు ఎంపికయ్యారు. అక్టోబర్‌ 20న అనంతపురంలో జరిగే సభలో ఆయన పురస్కారంతో పాటు రూ.10వేల నగదు బహుమతిని స్వీకరిస్తారు.

శాంతి నారాయణ

ఉడాలి నరసింహశాస్త్రి వైదుష్యం

‘డా. ఉడాలి నరసింహశాస్త్రి వైదుష్యం’ గ్రంథావిష్కరణ సభ సెప్టెంబర్‌ 29 ఉ.10.30నిమిషాలకు శ్రీరేబాల లక్ష్మీనరసారెడ్డి (జూ.) స్మారక భవనం, ట్రంక్‌ రోడ్‌, నెల్లూరులో జరుగుతుంది. సభలో ఉడాలి వెంకట నరసింహ రవి, విఠపు బాలసుబ్రహ్మణ్యం, చింతలపాటి పూర్ణానంద శాస్త్రి, ఉడాలి మహాలక్ష్మి తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 99890 05369.

పొన్నాల రామసుబ్బారెడ్డి

సాంఘిక నవలల పోటీ

పిడపర్తి వెంకటరమణ శర్మ జ్ఞాపకార్థం కౌముది వెబ్‌ మాస పత్రిక నిర్వహిస్తున్న 2025 ఉగాది సాంఘిక నవలల పోటీలో మూడు ఉత్తమ నవలలకు ఒక్కొక్క నవలకూ రూ.25వేలు, మూడు సాధారణ నవలలకు ఒక్కొక్క నవలకు రూ.15వేలు బహుమతులు అందిస్తారు. నవలలను తెలుగులో టైప్‌ చేసి (యూనికోడ్‌ లేదా అనుఫాంట్స్‌) లేదా స్కాన్‌ చేసి ఈమెయిల్లో మాత్రమే పంపాలి. నిడివి, మరిన్ని వివరాల కోసం www.koumudi.net వెబ్‌సైట్‌ చూడవచ్చు. నవలలను డిసెంబర్‌ 31లోగా novels2025@koumudi.netకు ఈమెయిల్‌ చేయాలి. ఫలితాలు మార్చి 2025లో వెబ్‌సైటులో ప్రకటిస్తారు.

కిరణ్‌ ప్రభ

Updated Date - Sep 23 , 2024 | 12:15 AM