ఈ వారం వివిధ కార్యక్రమాలు 26 08 2024
ABN, Publish Date - Aug 26 , 2024 | 12:28 AM
గిడుగు జయంతి వేడుకలు, అద్దేపల్లి పురస్కారం, మధురాంతకం రాజారాం సమగ్ర రచనల సంకలనం,‘పొలమారిన ఊరు’, కథలకు ఆహ్వానం...
గిడుగు జయంతి వేడుకలు
నవ్యాంధ్ర రచయితల సంఘం సారథ్యంలో గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్- – శంకరం వేదిక ఆధ్వర్యంలో గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలు ఆగస్టు 29 ఉ. 10 గంటలకు విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంథా లయంలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో గిడుగు జాతీయ భాషా సాహిత్య కళా సేవా రంగాల పురస్కారాల ప్రదానం, తెలుగు భాషా పరిరక్షణపై కవి సమ్మేళనం ఉంటాయి. బిక్కి కృష్ణ సభాధ్యక్షత వహించే ఈ వేడుకలకు టి.డి.జనార్థన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. వివరాలకు: 9246415150.
కలిమిశ్రీ
అద్దేపల్లి పురస్కారం
అద్దేపల్లి రామమోహనరావు సాహిత్య పురస్కారాన్ని 2024 సంవత్సరానికి గాను సాహితీవేత్త సన్నిధానం నరసింహశర్మకు ప్రదానం చేస్తున్నాము. సన్నిధానం కవిగా, విమర్శకునిగా వక్తగా ఎంతో ప్రసిద్ధి చెందినవారు. గౌతమీ గ్రంథాలయ ఉద్యోగిగా ఎంతోమంది కవులకూ పరిశోధకులకూ సహకరించడమే కాక వారితో సాహిత్య బంధాన్ని పెనవేసుకున్నవారు. అద్దేపల్లి రామమోహనరావు జన్మదిన సెప్టెంబర్ 8న కాకినాడలో జరిగే సభలో ఈ పురస్కార ప్రదానోత్సవం జరగనుంది.
ఉదయభాస్కరరావు
మధురాంతకం రాజారాం
సమగ్ర రచనల సంకలనం
మధురాంతకం రాజారాం సమగ్ర రచనల సంకలనం కోసం రాజారాం గారు రాసిన ముందు మాటలు, పీఠికలు, గ్రంథ సమీక్షల సేకరణ జరుగుతోంది. తమ దగ్గర వున్న ముందు మాటలు, పీఠికలు, గ్రంథ సమీక్షలను ఈ చిరునామాకు పంపవలసినదిగా రచయితలను, పాఠకులను అభ్యర్థిస్తున్నాను. చిరునామా: మధురాంతకం నరేంద్ర, 15-54/1 పద్మావతీ నగర్, తిరుపతి (పడమర) – 517502 ఫోన్: 9866243659, ఈమెయిల్: manarendra@gmail. com
మధురాంతకం నరేంద్ర
‘పొలమారిన ఊరు’, కథలకు ఆహ్వానం...
వెలుగు రామినాయుడు (శాసపు) రచించిన ‘పొలమా రిన ఊరు’ కవితా సంపుటిని ఈ ఆగస్ట్ 29సాయంత్రం 6 గంటలకు మక్క అప్పలనా యుడు ఆవిష్కరిస్తారు. విజయనగరం జిల్లా రాజాంలో గల శ్రీవేంకట సూర్యదుర్గా కళ్యాణ మండపంలో మజ్జిమదన్ మోహన్ అధ్యక్షతన జరుగనున్న సభలో అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, బాలసుధాకర్ మౌళి, గార రంగనాథం, జి.ఎస్. చలం, రౌతు వాసుదేవరావు తదితరులు పాల్గొంటారు.
వెలుగు మిత్రులు
కథలకు ఆహ్వానం
‘నాకు నచ్చిన నా కథ’ పేరిట ప్రచురించనున్న ఎనిమిదవ కథా సంకలనానికి శ్రీకారం చుట్టాం, సీనియర్ కథకుల నుండి, ఇప్పుడి ప్పుడే కథలు రాస్తున్న వర్ధమాన కథ రచయితల వరకు ఎవరైనా తమ తమ కథలను పంపవచ్చు. కథ డిటిపిలో గాని చేతి వ్రాతతో గాని నాలుగు పేజీలకు మించరాదు, ఇదివరకు ప్రచురణ అయిన కథలు కూడా పంపవచ్చు. కథలను సెప్టెంబర్ 30లోగా ఈమెయిల్: nkbabu.publisher@gmail.com కు మెయిల్ చేయవచ్చు. మరిన్ని వివరాలకు ఫోన్: 89777 32619.
ఎన్.కె. బాబు
Updated Date - Aug 26 , 2024 | 12:28 AM