ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నీటి కాంతి...

ABN, Publish Date - Jun 17 , 2024 | 03:31 AM

అంతా సీతాకోక చిలుకలకు దారం వేలాడిందని అనుకున్నవేళ నా సంభాషణ వాటితోనే మొదలైంది. ఎండాకాలపు రాత్రి సమయంలో కోట్లాది నక్షత్రాల వెలుగులో అనేక తూటాలు నిశ్శబ్ధంగా లేత శరీరాలను తాకి వుంటాయి...

1

అంతా సీతాకోక చిలుకలకు దారం వేలాడిందని అనుకున్నవేళ నా సంభాషణ వాటితోనే మొదలైంది. ఎండాకాలపు రాత్రి సమయంలో కోట్లాది నక్షత్రాల వెలుగులో అనేక తూటాలు నిశ్శబ్ధంగా లేత శరీరాలను తాకి వుంటాయి. పాలిండ్లను గాయం చేసి వుంటాయి. అందరూ సంఖ్యను లెక్కిస్తున్నారు. నేను గత, వర్తమాన, భవిష్యత్తును అంచనా వేస్తున్నాను. నా లెక్క దారానికి వేలాడే సీతాకోక చిలుకలు కోసం. మరణ సంఖ్యలు వరి విత్తనాలు మాత్రమే.

2

మరణం ఎవరిదైనా కన్నీళ్ళు సహజం. ఇది ఆనంద విషాదాల కావ్య రచన కాదు. అనేక సీతాకోక చిలుకల యుద్ధారావం. కన్నీటి ప్రవాహం మీదుగా సముద్రం, నది, వెన్నెల, ఆయుధం నడిచి వస్తాయి. మరణం సహజం. మెదడులో సవ్వడి చేసే ప్రవాహగానం శాశ్వతం. ఎక్కడో తెగిన మంచు బిందువు చివర రాలిన అశ్రుకణం. దశాబ్దాల క్రితం బుగ్గలపై జారిన చారికను ముద్దాడుతావా. కత్తితో మరింత గాయం చేయగలవా. మృత్యువు తర్వాత మిగిలిన నిశ్శబ్దాన్ని రాజ్యం సెలబ్రేట్‌ చేసుకుంటుంది.

3

ఎగురుతూ వెళుతున్న సీతాకోక చిలుక తల్లి ఒడిలో పాలు తాపాన్ని పొందుతున్న పసిపాప దగ్గర ఆగింది. మౌన తంత్రుల చివరాఖరి ఆకుపై వాలింది. ఆ పసిపాప కనులను, ఆకలి పొట్టచేసే శబ్ధం చివరాఖరి దృశ్యమని సీతాకోక చిలుకకు తెలియదు. తూటా శబ్ధానికి చివరి ఆకు నేలపై రాలింది. పసిపాప, ఆకు పచ్చని చెట్టు, సీతాకోక చిలుక నిర్జీవ దేహాలు. మరో విధ్వంస గేయానికి రాజ్య గ్యారంటీ.

4

అరణ్య రుతువులో మట్టి నుండి బయట పడిన అస్థిపంజరాలు. అడవిని పోలిన ఆదివాసీ. అతని పాదాల కింద దాగిన రజనులో ప్రపంచపు వెలుగు వుంది.

యుద్ధ రచన అర్థమయిందా?

5

ఈ నడక అనేక మృత్యు నీడల పురాస్మృతి. తెల్లవారు జామున వినబడుతున్న విప్లవగీతం. దేహం కోట్లాది రంధ్రాలమయమైనా గొంతు నుండి పావురం కదిలి మృతదేహాలపై వాలింది. అరణ్యం, మైదానం కలిసే చోట చెల్లా చెదురయిన మనుషులు కనబడతారు. ఎర్రటికాంతి పుంజం నిండా దాహం తీరిన మనుషులు. రక్తగానం ఆగి చల్లటి నీటికాంతి శరీరాన్ని తాకుతుంది. దేశం నాలుగు పుంజీల కుబేరుల జన్మస్థలం మాత్రమేనా? కోట్లాది జీవరాశుల నీడ కదా.

6

ఇంతకీ దారాన్ని కంఠంపై దాచుకున్న సీతాకోక చిలుక అమరత్వం. తనది మాత్రమేనా! ఈ దేశానిది కదా.

(కాంకేర్‌ అమరవీరుల సంస్మరణలో)

అరసవిల్లి కృష్ణ

92472 53884

Updated Date - Jun 17 , 2024 | 03:31 AM

Advertising
Advertising