వీల్ చైర్...
ABN, Publish Date - Oct 28 , 2024 | 05:58 AM
భలే మనుషులం మనం.. ఎక్కడ వదిలేస్తే అక్కడే ఉండిపోతాం పరుపులు, సోఫాల్లో రోజూ తనువు చాలిస్తూ చిత్ర విచిత్ర హింసలు పొందుతుంటాం దాటలేని దూరాల కోసం
భలే మనుషులం మనం..
ఎక్కడ వదిలేస్తే అక్కడే ఉండిపోతాం
పరుపులు, సోఫాల్లో రోజూ తనువు చాలిస్తూ
చిత్ర విచిత్ర హింసలు పొందుతుంటాం
దాటలేని దూరాల కోసం
శరీరాన్నంతా కాళ్లలోకి తెచ్చుకుంటాం
కానీ, బయలుదేరిన దగ్గరే చతికిలబడతాం
భయపెట్టే సీను వచ్చినప్పుడు
గట్టిగా కళ్లు మూసుకుంటాం
యుద్ధ రజను వాసనకు
లేసొస్తున్న రెక్కల దెయ్యాలు
తెరను కిందకు లాగేయమని
విదూషకుడు అరుస్తున్నాడు
భలే మనుషులం మనం
ఆ క్షణానికి కళ్లు మూస్తే, తెర లాగేస్తే
బతికేయొచ్చు అనుకుంటాం.
రివేరా
సాహిత్య వేదిక
బొమ్మలు: అక్బర్
Updated Date - Oct 28 , 2024 | 05:58 AM