పౌష్టికాహారం లేని బాలభారతం
ABN, Publish Date - Nov 08 , 2024 | 04:46 AM
మన పిల్లల ఆరోగ్యం చాలా దారుణంగా ఉంటున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం దేశంలో 6–23 నెలల మధ్య వయస్సు గల 77శాతం మంది శిశువులు కనీస ఆహార వైవిధ్యాన్ని పొందడం లేదు.
మన పిల్లల ఆరోగ్యం చాలా దారుణంగా ఉంటున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం దేశంలో 6–23 నెలల మధ్య వయస్సు గల 77శాతం మంది శిశువులు కనీస ఆహార వైవిధ్యాన్ని పొందడం లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 88.5శాతం బాలలు ఆహార వైవిధ్య ప్రమాణాలను అందుకోలేకపోతున్నారు. నాణ్యత లేని ఆహారం పిల్లల మనుగడ, పెరుగుదల, అభివృద్ధికి అవశ్యం మాత్రమే కాకుండా వారి అలవాట్లు సామర్థ్యాలకు కూడా అత్యంత ముఖ్యమైన అవరోధాలలో ఒకటి. కనీస ఆహార వైవిధ్యాన్ని నిర్ధారించడానికి అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. వీటిలో అత్యంత భయంకరమైనది ఆహార ద్రవ్యోల్బణం. గత 12 నెలల్లో పప్పుల ధర 10శాతం పెరిగింది. మెజారిటీ భారతీయులు మాంసాహారులు కూడా. పప్పు దినుసుల నుండి వృద్ధికి కీలకమైన పోషకాలైన ప్రోటీన్‌ను పొందుతున్నారు.
ఐక్యరాజ్యసమితి సంస్థల బృందం నివేదిక ప్రకారం భారత జనాభాలో 55.6శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారు. మహిళలను ప్రతికూలంగా ప్రభావితం చేసే లింగ వివక్ష మరొక అడ్డంకి. తల్లులలో కనీస ఆహార వైవిధ్యం లేకపోవడం వల్ల పిల్లలు ఆకలి బాధతో అలమటిస్తున్నారు. తల్లుల మధ్య విద్యా స్థాయి పిల్లల ఆహార వైవిధ్యాన్ని ప్రభావితం చేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆహార భద్రతకు సంబంధించిన విధానాలు పిల్లలు మరియు వారి ఆహారపుటలవాట్లపై అసంఖ్యాక పరిస్థితుల ప్రభావాన్ని గుర్తించడానికి విస్తృత చర్యలు చేపట్టాలి. బాలల శక్తి సామర్థ్యాల పెరుగుదలకు పౌష్టిక ఆహారం అందించుటకు ప్రభుత్వం విస్తృతంగా తగిన ఏర్పాట్లు చేయాలి.
– దండంరాజు రాంచందర్‌రావు
Updated Date - Nov 08 , 2024 | 04:46 AM