ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాళోజీ అనుబంధ కళాశాలల్లో బీహెచ్‌ఎంఎస్‌

ABN, Publish Date - Oct 11 , 2024 | 06:24 AM

వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె్‌స(కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌)- తెలంగాణలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ అనుబంధ హోమియో కళాశాలల్లో బీహెచ్‌ఎంఎస్‌ ప్రోగ్రామ్‌నకు సంబంధించిన...

కాళోజీ అనుబంధ కళాశాలల్లో బీహెచ్‌ఎంఎస్‌

వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె్‌స(కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌)- తెలంగాణలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ అనుబంధ హోమియో కళాశాలల్లో బీహెచ్‌ఎంఎస్‌ ప్రోగ్రామ్‌నకు సంబంధించిన ఆలిండియా కోటా, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. నీట్‌ యూజీ 2024 స్కోర్‌, కౌన్సెలింగ్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదున్నరేళ్లు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఆలిండియా కోటా సీట్లు

  • జేఐఎంఎస్‌ హోమియోపతిక్‌ మెడికల్‌ కాలేజ్‌, శంషాబాద్‌- 15

  • ఎంఎన్‌ఆర్‌ హోమియోపతిక్‌ మెడికల్‌ కాలేజ్‌, సంగారెడ్డి- 15

  • హంస హోమియోపతి మెడికల్‌ కాలేజ్‌, ములుగు- 15

  • దేవ్స్‌ హోమియోపతిక్‌ మెడికల్‌ కాలేజ్‌, కీసర- 7

  • గురు నానక్‌ హోమియోపతిక్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌, ఖానాపూర్‌- 15

  • మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు

  • జేఐఎంఎస్‌, ఎంఎన్‌ఆర్‌, గురునానక్‌, హంస హోమియోపతిక్‌ మెడికల్‌ కాలేజీల్లో ఒక్కోదానిలో 35 ‘బి’ కేటగిరీ సీట్లు; 15 ‘సి’ కేటగిరీ సీట్లు ఉన్నాయి.

  • దేవ్స్‌ హోమియోపతిక్‌ మెడికల్‌ కాలేజీలో 10 ‘బి’ కేటగిరీ సీట్లు, 5 ‘సి’ కేటగిరీ సీట్లు ఉన్నాయి.


నీట్‌ యూజీ 2024 కటాఫ్‌

  • మొత్తం 720 మార్కులకు గాను జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 162; జనరల్‌ కేటగిరీ దివ్యాంగులకు 144; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 127 మార్కులను కటా్‌ఫ్‌గా నిర్దేశించారు.

అర్హత

  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ(బోటనీ, జువాలజీ), ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/పన్నెండోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌ స్థాయిలో జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం; జనరల్‌ కేటగిరీ దివ్యాంగులకు 45 శాతం; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి. అభ్యర్థుల వయసు 2024 డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.

ముఖ్య సమాచారం

  • ఆలిండియా కోటా సీట్లకు రిజిస్ట్రేషన్‌, వెరిఫికేషన్‌ ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.2500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,000

  • మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.4,000

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 16

  • వెబ్‌సైట్‌: www.knruhs.telangana.gov.in

Updated Date - Oct 11 , 2024 | 06:29 AM