RRB NTPC 2024: ఇంటర్, డిగ్రీతో ప్రభుత్వ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్, అప్లై చేశారా
ABN, Publish Date - Oct 19 , 2024 | 08:07 PM
RRB NTPC 2024 దరఖాస్తు ఫారమ్ నింపే ప్రక్రియ అక్టోబర్ 20తో ముగుస్తుంది. RRB NTPC దరఖాస్తు ఫారమ్‌ను నింపే ప్రక్రియను అక్టోబర్ 20కి పొడిగించారు. దరఖాస్తు రుసుమును ఈ నెల 21 నుంచి 22 వరకు చెల్లించవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: RRB NTPC 2024 దరఖాస్తు ఫారమ్ నింపే ప్రక్రియ అక్టోబర్ 20తో ముగుస్తుంది. RRB NTPC దరఖాస్తు ఫారమ్‌ను నింపే ప్రక్రియను అక్టోబర్ 20కి పొడిగించారు. దరఖాస్తు రుసుమును ఈ నెల 21 నుంచి 22 వరకు చెల్లించవచ్చు. అక్టోబర్ 23 నుంచి మార్పులు చేసుకోవచ్చు. రుసుమును ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి. ఫీజు రాయితీ కేటగిరీలు మినహా అందరూ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.500కాగా, PwBD/మహిళలు/ట్రాన్స్‌జెండర్లు/మాజీ సైనికులు/SC/ST/మైనారిటీలు/ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారు రూ. 250 చెల్లించాలి. కంప్యూటర్ బేస్‌డ్ పరీక్ష తరువాత దరఖాస్తు రుసుమును అభ్యర్థులకు తిరిగి చెల్లిస్తారు. RRB NTPC పరీక్ష తేదీలను 2024లో ప్రకటిస్తారు.
దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండిలా..
RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
'RRB NTPC Apply Online' లింక్‌పై క్లిక్ చేయండి
పరీక్ష కోసం నమోదు చేసుకోవడానికి వివరాలను ఎంటర్ చేయండి
రిజిస్ట్రేషన్ ID, పాస్వర్డ్‌లు క్రియేట్ చేయాలి
అనంతరం RRB NTPC 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు రుసుము చెల్లించండి
RRB NTPC అప్లికేషన్ ఫారమ్ 2024 ప్రింటౌట్ తీసుకోండి
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..
TG News: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..
TG News: ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో సహించలేని ఓ యువకుడు ఏం చేశాడంటే
Updated Date - Oct 19 , 2024 | 08:14 PM