ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 600 పోస్టులకు రేపే నోటిఫికేషన్..

ABN, Publish Date - Jan 31 , 2024 | 03:26 PM

TSPSC Group -1 Notification: తెలంగాణ నిరుద్యోగలకు బిగ్ అలర్ట్. రెండుసార్లు రద్దైన గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి బుధవారం నాడు కీలక ప్రకటన వెలువడనుంది. గతంలో ఉన్న 503 పోస్టులకు మరో 96 పోస్టులు కలిపి మొత్తం 600 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం.

TSPSC Group -1 Notification

TSPSC Group -1 Notification: తెలంగాణ నిరుద్యోగలకు బిగ్ అలర్ట్. రెండుసార్లు రద్దైన గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి బుధవారం నాడు కీలక ప్రకటన వెలువడనుంది. గతంలో ఉన్న 503 పోస్టులకు మరో 96 పోస్టులు కలిపి మొత్తం 600 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం. ఫిబ్రవరి 1వ తేదీన ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది.

కాగా, 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. 2,80,000 మంది హాజరయ్యారు. అయితే, ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైనా.. పేపర్ లీకేజ్ కారణంగా ఆ పరీక్ష రద్దైంది. దాంతో 2023 జూన్‌లో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. దీనిపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా.. పరీక్షల నిర్వహణలోని లోపాల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కానీ, కోర్టులో ఇంత వరకు వాదనలు జరుగలేదు.

మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్..

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అవగా.. గ్రూప్‌ 1 పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త పోస్టులు కలిపి రీ నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. బుధవారం సాయంత్రం 5 గంటల లోపు అన్ని శాఖల్లో గ్రూప్ 1 ఖాళీల వివరాలు తెలపాలని అధికారులను ఆదేశించారు. 96 పోస్టులను అదనంగా చేరుస్తూ మొత్తం 600 పోస్టులకు గురువారం నాడు రీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

Updated Date - Jan 31 , 2024 | 03:31 PM

Advertising
Advertising