Rahul Gandhi: మరోసారి ఐశ్వర్యారాయ్ పేరు లాగిన రాహుల్ గాంధీ.. బీజేపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు..!
ABN, Publish Date - Apr 25 , 2024 | 10:12 AM
ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జాతీయ కుల గణణ చేపడతామని, ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకుంటామని కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ``సామాజిక న్యాయ్ సమ్మేళన్``లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు.
ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జాతీయ కుల గణన చేపడతామని, ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకుంటామని కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ``సామాజిక న్యాయ్ సమ్మేళన్``లో (Samajik Nyay Sammelan) రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. తనను నాన్-సీరియస్ పొలిటీషియన్‌గా ప్రతిపక్షాలు, మీడియా అభివర్ణించడం గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ (Aishwarya rai) పేర్లను ప్రస్తావించారు (Loksabha Elections).
``నన్ను కొన్ని మీడియా సంస్థలు నాన్-సీరియస్ పొలిటీషియన్ అంటున్నాయి. ఉపాధి హామీ పథకం, భూసేకరణ బిల్లు, భట్టా పర్సౌల్ ఉద్యమం మొదలైన వాటి గురించి మాట్లాడడం వారి దృష్టిలో సీరియస్ కాదు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితేనే సీరియస్‌గా తీసుకుంటారా?`` అని ప్రశ్నించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ సమయంలో కూడా అమితాబ్, ఐశ్వర్య పేర్లను ప్రస్తావిస్తూ బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
``రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి సామాన్యులను, బీసీలను ఎందుకు ఆహ్వానించలేదు. ఆ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, అంబానీ, అదానీ.. ఇలా అందరూ ధనవంతులే కనిపించారు. ఆ కార్యక్రమంలో ఒక్క పేదవాడిని కూడా నేను చూడలేదు. ఒక్క రైతు, ఒక్క కార్మికుడు, ఒక్క నిరుద్యోగ యువకుడు ఆ కార్యక్రమంలో నాకు కనిపించలేద``ని రాహుల్ గాంధీ గత ఫిబ్రవరిలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
Lok Sabha Election: ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గా రామసహాయం రఘురాంరెడ్డి
ABN BIG Debate: గల్లా జయదేవ్‌ను పంపించినట్టు.. నన్ను ఎవరు ఏం చేయలేరు
మరిన్ని ఎన్నికల వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 25 , 2024 | 10:13 AM