ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నాయకా.. నెమ్మది!

ABN, Publish Date - May 05 , 2024 | 06:36 AM

నాయకుల వాహనాలంటేనే హడావుడి.. పదుల సంఖ్యలో కార్లు రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తుంటాయి.

  • పలువురు ఎంపీ అభ్యర్థుల వాహనాలపై అతివేగం చలాన్లు

  • నామినేషన్‌ నాటికీ పెండింగ్‌.. విషయం తెలిసి వెంటనే చెల్లింపు

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): నాయకుల వాహనాలంటేనే హడావుడి.. పదుల సంఖ్యలో కార్లు రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తుంటాయి.. అతి వేగం, నిర్లక్ష్యం, సిగ్నల్‌ జంప్‌ సరేసరి. ప్రస్తుతం పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థుల వాహనాలపై ట్రాఫిక్‌ చలానాలు భారీగానే ఉన్నాయి. నిబంధనల ప్రకారం.. నామినేషన్‌ సమయానికి వాటన్నిటినీ చెల్లించాలి. కానీ, ఆ పని చేయలేదు. ఈ విషయం శనివారం ప్రచారంలోకి వచ్చింది. దీంతో కొందరు ట్రాఫిక్‌ చలానాలు చెల్లించేశారు. కాగా, బాధ్యత గల వ్యక్తులుగా పరిమిత వేగం, నిబంధనలకు లోబడి డ్రైవింగ్‌ చేసేలా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


కొప్పులపైనే అధికం.. బూరకు సెకను తేడాలో

పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ వాహనం (టీఎ్‌స02ఈవై 0456)పై జనవరి 15- ఏప్రిల్‌ 22 మధ్య అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణాలతో ఆరుసార్లు ఉల్లంఘనలకు గాను సిద్దిపేట, మేడ్చల్‌, మంచిర్యాల పోలీ్‌సలు రూ.6210 జరిమానా విధించారు.

బీజేపీ భువనగిరి అభ్యర్ధి బూర నర్సయ్య (టీఎ్‌స09ఎ్‌ఫఎస్‌ 6699) జనవరి 19న అతివేగంగా వెళ్తుండగా చౌటుప్పల్‌ ట్రాఫిక్‌ పోలీ్‌సలు రూ.1,035 జరిమానా వేశారు. గత నెల 22న ఐఐసీటీ హబ్సిగూడ వద్ద అతివేగం కారణంగా నల్లకుంట ట్రాఫిక్‌ పోలీ్‌సలు రూ.1035 చలానా రాశారు. అయితే, సెకన్‌ వ్యవధిలో మరో జరిమానా కూడా విధించడం గమనార్హం.


కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ ఎంపీ అభ్యర్ధి నీలం మధు వాహనం (టీఎస్‌ 15ఎఫ్‌జే2345)పై నార్సింగి, మేడ్చల్‌, గజ్వేల్‌, బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ స్టేషన్ల పరిధిలో రూ.3,305, జహీరాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి సురేష్‌ షెట్కర్‌ వాహనంపై రూ.3,105, పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి గోమాస శ్రీనివాస్‌ వాహనంపై రూ.2,070 చలాన్లు ఉన్నాయి.

సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పద్మారావు వాహనంపై రూ.1,035, నల్లగొండ నుంచి పోటీ చేస్తున్న కంచర్ల కృష్ణారెడ్డి వాహనంపై రూ.200 జరిమానా ఉన్నాయి.

Updated Date - May 05 , 2024 | 06:36 AM

Advertising
Advertising