Share News

Health: దీర్ఘాయుష్షు కోసం ఈ రక్త పరీక్షలు తప్పనిసరి!

ABN , Publish Date - Dec 26 , 2024 | 08:45 AM

ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వైద్య పరీక్షలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా చేయించుకునే వైద్య పరీక్షలతో అనేక రోగాలను తొలి దశలో ఉండగానే గుర్తించవచ్చు. ఫలితంగా రోగ చికిత్సల ప్రభావం కూడా పెంచుకోవచ్చు.

Health: దీర్ఘాయుష్షు కోసం ఈ రక్త పరీక్షలు తప్పనిసరి!

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరూ దీర్ఘాయుష్షును కోరుకుంటారు. కసరత్తులు, పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. వీటితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వైద్య పరీక్షలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా చేయించుకునే వైద్య పరీక్షలతో అనేక రోగాలను తొలి దశలో ఉండగానే గుర్తించవచ్చు. ఫలితంగా రోగ చికిత్సల ప్రభావం కూడా పెంచుకోవచ్చు. మరి ఆరోగ్యం కాపాడుకునేందుకు క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన పరీక్షలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం (Health).


ఆరోగ్యవంతులు కూడా క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన పరీక్షలు ఏవో రేణు రఖేజా అనే న్యూట్రిషనిస్టు ఇన్‌స్టా‌గ్రామ్ వేదికగా తెలిపారు. ఈ సూచనలతో అనేక మంది ఏకీభవించారు.

Health: ఊహించని ప్రమాదంలో పడ్డ మహిళ! ఉదయాన్నే ఒకేసారి 4 లీటర్ల నీరు తాగితే..


విటమిన్ డీ టెస్టు

ఎముకల ఆరోగ్యానికి కీలకమైన విటమిన్ డీ స్థాయి ఎంత ఉందో తెలుసుకునేందుకు ఈ టెస్టు కీలకం. మెనోపాజ్ తరువాత జరిగే హార్మోనల్ మార్పుల కారణంగా మహిళల్లో ఆస్టియోపోరోసిస్ వ్యాధి తలెత్తే అవకాశాలు ఎక్కువ. కాబట్టి, మహిళలకు ఈ టెస్టు తప్పనిసరి. దీంతో, రక్తంలో విటమిన్ డీ స్థాయి ఎంత ఉందో తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టవచ్చు.

లివర్ ఫంక్షన్ టెస్టులు

కాలేయ పనితీరును ముదింపు వేసేందుకు లివర్ ఫంక్షన్ టెస్టులు అవసరం. ఈ పరీక్షల్లో భాగంగా రక్తంలో వివిధ ఎంజైములు, ప్రొటీన్లు, బిలిరుబిన్ స్థాయిని చెక్ చేస్తారు.

కిడ్నీ ఫంక్షన్ టెస్టులు

ఈ పరీక్షలతో కిడ్నీ పనితీరుపై ఓ కన్నేసి ఉంచొచ్చు. క్రియాటినైన్‌తో పాటు బ్లడ్ యూరియా నైట్రోజన్‌ ఎంతుందో తెలుసుకునేందుకు ఈ పరీక్షలు చేస్తారు. క్రియాటినైన్, బ్లడ్ యూరియా స్థాయిలో అధికంగా ఉంటే కిడ్నీలో ఏదో సమస్య ఉండే అవకాశం ఉంది. ఈ సమస్యను చక్కదిద్దని పక్షంలో కిడ్నీలు విఫలమయ్యే ప్రమాదం ఉంది.

Eye Health: కంటి ఆరోగ్యం కోసం వివిధ వయసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!


ఎపో బీ

గుండె సంబంధిత సమస్యల ప్రమాదం ఎంత ఉందో తెలుసుకునేందుకు అపో లిపోప్రొటీన్ బీ పరీక్ష ఉపకరిస్తుంది. కొన్ని రకాల అనారోగ్యాలున్న వారికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల కంటే ఎపో బీ పరీక్షలతోనే హృద్రోగాల అవకాశాలను మరింత మెరుగ్గా అంచనా వేయొచ్చని వైద్యులు చెబుతున్నారు.

హెచ్‌బీఏ1సీ

గత రెండు మూడు నెలల్లో శరీరంలో సగటు చక్కెర స్థాయిలను అంచనా వేసేందుకు హెచ్‌బీఏ1సీ పరీక్ష అత్యంత ఉపయుక్తమైనది. హెచ్‌బీఏ1సీ స్థాయి అధికంగా ఉంటే రక్తంలో చక్కెర ఎక్కువా ఉందని అర్థం. ఈ పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదిస్తే పరిస్థితి అదుపు తప్పకుండా ఉంటుంది.

Read Latest and Health New

Updated Date - Dec 26 , 2024 | 08:59 AM