Weight Loss: ఈ 6 కసరత్తులతో డైటింగ్ లేకుండానే బరువు తగ్గుతారు! ఇది పక్కా!
ABN, Publish Date - Jun 17 , 2024 | 09:18 PM
డైటింగ్ అవసరం లేకుండానే బరువు తగ్గేందుకు అనువైన ఎక్స్‌ర్‌సైజులు ఆరు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: బరువు తగ్గి యంగ్ గా (Health) కనిపించాలని చాలా మందికి ఉంటుంది. కసరత్తులు చేసేందుకు కూడా చాలా మంది రెడీగా అంటారు కానీ ఎక్సర్‌సైజులతో పాటు డైటింగ్ చేయాలంటే మాత్రం చాలా మంది మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తారు. అయితే, డైటింగ్ బెడద లేకుండా సులువుగా బరువు తగ్గించే ఆరు ఎక్స్‌ర్‌సైజులు ట్రై చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
Health: ఇలా చేస్తే మీపై మీకు పూర్తి కంట్రోల్.. మనసు అదుపు తప్పదు!
కాళ్ల కండరాలను శక్తిని వినియోగించుకునే సామర్థ్యం ఎక్కువ. కాబట్టి మెట్లను ఎక్కి దిగుతూ ఉంటే కెలరీలు త్వరగా ఖర్చై సులభంగా బరువు తగ్గొచ్చు.
స్కిప్పింగ్ చిన్న పిల్లల ఆటగా చూస్తారు కానీ దీనితో పెద్దలకూ బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. తొలిసారి ఇది చేసే వారు 30 సెకెన్ల పాటు స్కిప్పింగ్ చేసి మరో 30 సెకెన్లు రెస్టు తీసుకోవాలి. ఇలా ఒక సెషన్ లో కనీసం 15 నిమిషాల పాటు చేయగలిగేలా ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
శరీరంలో కోర్ స్ట్రెన్త్ పెంచేందుకు పిలాటేస్‌కు మించినది లేదు. దీంతో ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. వరుసగా 12 వారాలా పిలాటేస్ చేసే వారిలో గణనీయమైన మార్పులు కనిపించినట్టు ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది.
జాగింగ్ కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు 30 నిమిషాల చొప్పున వారానికి నాలుగు రోజులు జాగింగ్ చేస్తే అద్భుతాలు సాధ్యమవుతాయి.
యోగాతో కూడా బరువు తగ్గొచ్చంటే చాలా మందికి ఆశ్చర్యం కలిగించొచ్చు. అయితే, క్రమం తప్పకుండా యోగా చేసేవారిలో బీఎమ్ఐ ఇతరులకంటే తక్కువగా ఉన్నట్టు జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్‌లోని ఓ అధ్యయనం తేల్చింది.
కండలు పెంచేందుకు ఉద్దెశించిన స్ట్రెన్త్ ట్రెయినింగ్ ఎక్సర్‌సైజులు జీవక్రియల వేగం పెంచి కొవ్వు కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. పుషప్స్ వంటి సాధారణమైన ఎక్సర్‌సైజులతో ప్రారంభించి క్రమంగా ఎత్తే బరువును పెంచుకుంటూ వెళ్లాలి. వారానికి మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
Updated Date - Jun 17 , 2024 | 09:19 PM