ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health: ఆందోళనతో బాధపడే వాళ్లు ఉదయాన్నే తినాల్సిన ఫుడ్స్ ఇవి!

ABN, Publish Date - Jul 20 , 2024 | 10:00 PM

ఆధునిక జీవనశైల కారణంగా ఇటీవల కాలంలో అనేక మంది ఒత్తిడి ఆందోళనకు లోనవుతున్నారు. దీనికి చికిత్సగా మందులు, థెరపీతో పాటు కొన్ని రకాల ఆహారాలు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ కింద తింటే ఆందోళన తగ్గుతుందని చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక జీవనశైల కారణంగా ఇటీవల కాలంలో అనేక మంది ఒత్తిడి, ఆందోళనకు (Anxiety) లోనవుతున్నారు. కొందరు అప్పుడప్పుడూ ఆందోళనకు లోనవుతుంటే మరికొందరిని ఇది నిరంతరం వేధిస్తోంది. అయితే, ఆందోళనలో కూడా రకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే, మందులు, థెరపీతో పాటు కొన్ని రకాల ఆహారాలు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ కింద తింటే ఆందోళన తగ్గుతుందని చెబుతున్నారు (Health). అవేంటో ఓసారి చూద్దాం.

Dental Care: పొద్దున్నే బ్రష్ చేసుకున్నాక ఈ తప్పు మాత్రం చేయొద్దు.. ఓ డెంటిస్ట్ హెచ్చరిక!


సాల్మన్ చేపలోని విటమిన్ డీ, ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్, ఐకోసాపెంటనోయిక్ యాసిడ్ మెదడుకు ఎంతో మేలు చేసి ఆందోళన తగ్గిస్తాయట. డొపమైన్, సెరటోనిన్‌లను నియంత్రించి రిలాక్ష్ అయ్యేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పసుపులో కుకుర్మిన్ అనే రసాయం సమృద్ధిగా ఉంటుంది. ఇది కూడా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి డిప్రెషన్‌ను తొలగిస్తుంది.

యోగర్ట్‌లోని హితకర బ్యాక్టీరియా శారీరక మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుస్తుంది. మెదడు కణాలను కాపాడి ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది.

మెదడు పనితీరును మెరుగుపరిచే అనేక గుణాలు బాదం పప్పుల్లో ఉన్నాయి. ఒత్తిడి నుంచి బయటపడాలనుకునే వారికి బాదంపప్పులు మంచి ప్రయోజనం కలుగజేస్తాయి.


కోడి గుడ్లల్లో ఉన్న ట్రిప్టోఫాస్ అనే అమైనోయాసిడ్ ఆందోళనను తగ్గిస్తుంది. ఇందులో అధికంగా ఉంటే ఇతర ప్రొటీన్లు మానసిక ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి.

గ్రీన్‌ టీలో ఉండే ఎల్-థియానిన్ కూడా మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఒత్తిడి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్‌ను తగ్గించి ఆందోళన నుంచి ఉపశమనం కల్పిస్తుంది.

డార్క్ చాక్లెట్‌లో ఉండే ఎపికాటచిన్, కాటచిన్ అనే రసాయనాలకు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి మెదడును హానికారక ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడుతుంది. అంతిమంగా ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.

చామోనిల్ అనే మూలికలో కూడా యాంటిఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరు మెరగయ్యేందుకు, మానసిక ఆరోగ్యానికి కీలకం.

Updated Date - Jul 20 , 2024 | 10:00 PM

Advertising
Advertising
<