ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్రీమ్.. లోషన్ ఏది బెస్ట్.. చలికాలంలో ఈ తప్పులు చేయకండి..

ABN, Publish Date - Nov 18 , 2024 | 07:16 PM

అతి అన్నింటా అనర్థమే అంటారు. చలికాలంలో తలకు పెట్టుకునే నూనె దగ్గర నుంచి చర్మాన్ని అన్నింట్లోనూ అతి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నష్టమే ఎక్కువగా ఉంటుంది...

Winter Care

చలికాలంలో వీచే చలి గాలుల తాకిడికి చర్మం పొడిబారుతుంది. జట్టు కూడా జీవాన్ని కోల్పోయి నిర్జీవంగా అనిపిస్తుంది. ఇక పగిలిన పెదాలు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే, వీటి నుంచి వెంటనే రిలీఫ్ రావాలని కొన్ని తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఈ లక్షణాలు పరిస్థితిని మరీ దిగజార్చడమే కాకుండా అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి.


క్రీమ్, లోషన్ ఏది వాడాలి..

మీరు ఎలాంటి చర్మతత్వాన్ని కలిగి ఉన్నా సరే మాయిశ్చరైజర్‌ను వాడటం తప్పనిసరి. అయితే, పొడి చర్మం ఉన్నవారు కాస్త మందంగా ఉండే వాటిని ఎంచుకోవడమే మేలు. అలాగని మరీ ఎక్కువ జిగటగా ఉన్న వాటిని వాడితే అవి చర్మాన్ని పాడుచేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. కొనే ముందు లేబుల్ ని స్కాన్ చేయడం వలన అందులో ఏవైనా హానికర పదార్థాలు ఉన్నాయా అనే విషయం తెలుస్తుంది. ఇక ఆయిలీ స్కిన్ ఉన్నవారు వాటర్ బేస్డ్ లోషన్స్ క్రీమ్స్ వాడితే సరిపోతుంది. ఇవి చర్మం పొడిబారడం వల్ల వచ్చే ముడతలు, డెడ్ స్కిన్ ను పైకి కనపడకుండా చేస్తాయి.


స్నానంతో జాగ్రత్త..

చలికాలం వేడి నీటి స్నానం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. కానీ, మరీ పొగలు కక్కే నీటితో స్నానం చేయడం వల్ల చర్మపు గ్రంధుల్లో ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. ఇది చర్మాన్ని మరింత అసౌకర్యానికి గురిచేస్తుంది. స్నానాన్ని 5-10 నిమిషాల్లో ముగించాలి.

పెదాలపై డెడ్ స్కిన్ అందుకే..

పెదాలకు వేసుకునే లిప్ బామ్ లోనూ సరైన ఎంపిక ఎంతో అవసరం. పెదాలు శరీరంలోనే అతి సున్నితమైన భాగం. అయితే, వీటికి అవసరానికి మించి తేమను అందించడం, లిప్ బామ్ ను మరీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల పెదాలపై చర్మం ఎండిపోతుంది. అది ప్యాచీ లిప్స్‌గా మారుతుంది.


ఈ టిప్ ట్రై చేయండి..

చర్మం మరీ పొడిబారినప్పుడు స్నానం చేసే నీటిలో రెండు చుక్కల కొబ్బరి నూనెను వేసుకోవడం వల్ల మాయిశ్చరైజర్ అవసరం లేకపోయినా స్కిన్ తాజాగా ఉంటుంది. అయితే నూనెను రెండు చుక్కల కన్నా ఎక్కువ వేసుకుంటే జిడ్డుగా మారుతుంది. అయితే, పలుచటి జుట్టు ఉన్న వారు తల స్నానం చేసేటప్పుడు ఇలా చేయకపోవడమే మేలు. ఇది జుట్టును జిడ్డుగా మారుస్తుంది.

అతిగా ఆయిలింగ్ వద్దు..

చలికాలంలో హెన్నాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ ఈ ప్యాక్ వేసుకున్నా మరుసటి రోజు తలకు నూనె రాసుకుంటే పోడిబారకుండా ఉంటుంది. బలహీనమైన జుట్టు ఉన్నవారు అతిగా నూనెను పెట్టుకుంటే అది జుట్టుని మరింత డ్యామేజ్ చేసి ఊడిపోయేలా చేస్తుంది.

Yogi Adityanath: బుల్డోజర్ సిద్ధంగా ఉంది.. యోగి నోట మళ్లీ అదేమాట


Updated Date - Nov 18 , 2024 | 07:25 PM