ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anti Aging Fruits: ఎంత వయసొచ్చినా యవ్వనంగా కనిపించాలనుందా? ఈ 5 రకాల పండ్లు బాగా తీసుకోండి చాలు..

ABN, Publish Date - Feb 21 , 2024 | 08:01 PM

ఎంత వయసు గడిచినా యవ్వనంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ 5 రకాల పండ్లు యవ్వనంగా ఉంచుతాయి.

పండ్లలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫైబర్ కూడా మంచి మొత్తంలో ఉంటుంది. అదే విధంగా విటమిన్లు కూడా ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. పండ్లు బాగా తీసుకుంటే ముఖం మీద ముడతలు, ఫైన్ లైన్స్ సమస్య దూరమవుతుంది. ఇవి చర్మానికి యాంటీ ఏజింగ్ గుణాలు అందిస్తాయి. దీని వల్ల చర్మం ఆరోగ్యం అంతర్గతంగా బాగుంటుంది. చర్మం ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తుంది. చర్మానికి యాంటీ ఏజింగ్ గుణాలను అందించే పండ్లేమిటో తెలుసుకుంటే..

ఆరెంజ్..

బెస్ట్ యాంటీ ఏజింగ్ ఫ్రూట్స్ లో ఆరెండ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ కారమంగా ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అదే విధంగా నారింజలో ఉండే , అధిక యాంటీ-ఆక్సిడెంట్ కంటెంట్లు శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలించడంలో సహాయపడతాయి. రోజూ నారింజ పండు తింటూంటే చర్మం బిగుతుగా తయారవుతుంది.

ఇది కూడా చదవండి: Eye Sight: రోజూ ఈ పొడి చిటికెడు తీసుకుంటే చాలు.. కంటిచూపు పదునెక్కడం ఖాయం!



బొప్పాయి..

బొప్పాయి పండు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే యాంటీ ఏజింగ్ ఫ్రూట్. బొప్పాయిలో విటమిన్-సి, ఫోలెట్, విటమిన్-ఎ, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, విటమిన్-కె వంటివి మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖం మీద ముడతలు రాకుండా చేస్తాయి. బొప్పాయిని తినవచ్చు, ముఖానికి ప్యాక్ లానూ వేసుకోవచ్చు.

యాపిల్..

రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదనేది పూర్తిగా నిజం. యాపిల్స్ లో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. యాపిల్ తినడం వల్ల చర్మం లోపలి నుండి యవ్వనంగా మారుతుంది.

బ్లూబెర్రీస్..

బ్లూబెర్రీస్ లో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను అందిస్తాయి. బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది.

అవకాడో..

యాంటీ ఏజింగ్ ఫ్రూట్స్‌లో అవకాడో కూడా ఉంది. అవకాడో శరీరానికి కొవ్వు ఆమ్లాలను అందిస్తుంది. విటమిన్ కె, సి, ఇ, ఎ, బి లు పుష్కలంగా ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా అవకాడోలో పొటాషియం కూడా మంచి మొత్తంలో ఉంటుంది. రోజూ అవకాడో తినడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Super Foods: ఈ 5 ఆహారాలు తీసుకుంటూ ఉంటే చాలు.. సీజన్ ఇన్ఫెక్షన్లు మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Updated Date - Feb 21 , 2024 | 08:01 PM

Advertising
Advertising