Apple Juice: యాపిల్ చర్మానికి చేసే మేలు ఎంత? యాపిల్ జ్యూస్ ను ముఖానికి రాస్తుంటే జరిగేదేంటి?
ABN, Publish Date - Jul 22 , 2024 | 02:12 PM
'రోజుకో యాపిల్ తింటే డాక్టర్లకు దూరంగా ఉండవచ్చు' అనే మాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఈ పండులో చాలా ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. కానీ యాపిల్ జ్యూస్ చర్మానికి రాస్తే..
'రోజుకో యాపిల్ తింటే డాక్టర్లకు దూరంగా ఉండవచ్చు' అనే మాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఈ పండులో చాలా ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. అంతే కాదు రోజూ ఒక యాపిల్ తినడం వల్ల చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది. రోజుకో యాపిల్ తినేవారి చర్మం రంగు సాధారణ వ్యక్తుల కంటే మెరుగ్గా ఉంటుందని చర్మ సంరక్షణ నిపుణులు కూడా చెబుతున్నారు. అసలు రోజుకొక యాపిల్ తించే చర్మానికి జరిగే మేలు ఎంత? యాపిల్ జ్యూస్ ను రోజూ చర్మానికి రాస్తుంటే కలిగే మార్పులు ఏంటి? తెలుసుకుంటే..
Irregular Periods: పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లేదా? ఈ ఒక్క డ్రింక్ తాగి చూడండి..!
రోజూ యాపిల్ తింటే..
రోజుకొక యాపిల్ తింటే చర్మం మెరుస్తుంది. చాలా కాంతివంతంగా మారుతుంది. యాపిల్‌లో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, విటమిన్- సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం మీద సూక్ష్మక్రిములు, అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతాయి. ఈ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేయడంలో సహాయపడతాయి.
వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది అకాల వృద్ధాప్య సమస్యను అధిగమించడంలో సహాయపడుతుంది. యాపిల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మంపై అకాల వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.
cooking Facts: నూనె లేకుండా కేవలం ఆవితోనూ, ఉడికించి వంట చేసుకుంటే ఏం జరుగుతుంది?
ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలను తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్రీన్ యాపిల్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మొటిమలు, మొటిమల తాలూకు ఇతర సమస్యలు నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖంపై మోటిమలు, మచ్చలు లేదా నల్ల మచ్చలు ఉంటే యాపిల్ తినడం ద్వారా తగ్గించుకోవచ్చు.
పై ప్రయోజనాలు మాత్రమే కాకుండా రోజూ యాపిల్ తింటే చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది, UV కిరణాల నుండి రక్షిస్తుంది, కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది.
చర్మం కోసం..
యాపిల్ ను మిక్సీ వేసి లేదా తురిమి జ్యూస్ తీయాలి. ఈ జ్యూస్ లో కాటన్ బాల్ ను అద్ది యాపిల్ జ్యూస్ ను ముఖం అంతటా అప్లై చేయాలి. యాపిల్ జ్యూస్ ముఖం మీద ఆరిపోయాక సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో 2 నుండి 3 సార్లు ఇలా చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jul 22 , 2024 | 02:12 PM