ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Apples: బాంబ్ పేల్చిన FSSAI.. ఎర్రగా నిగనిగలాడే యాపిల్స్ ను కొనేవాళ్లకు అలెర్ట్..!

ABN, Publish Date - Jul 12 , 2024 | 08:14 PM

రోజుకు ఒక యాపిల్ తింటూ ఉంటే డాక్టర్ అవసరమే ఉండదని అంటూ ఉంటారు. యాపిల్ కొనాలని అనుకునేవారు ఎప్పుడూ తాజాగా ఉన్న యాపిల్స్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే చాలామంది యాపిల్స్ ఎర్రగా నిగనిగలాడుతూ ఉంటే అవి తాజాగా ఉన్నట్టు భావిస్తారు. అయితే ఇలా ఎర్రగా నిగనిగలాడే యాపిల్స్ ఇప్పుడు కొంప ముంచుతున్నాయి.

యాపిల్స్ ఆరోగ్యానికి చాలామంచివి. రోజుకు ఒక యాపిల్ తింటూ ఉంటే డాక్టర్ అవసరమే ఉండదని అంటూ ఉంటారు. యాపిల్ కొనాలని అనుకునేవారు ఎప్పుడూ తాజాగా ఉన్న యాపిల్స్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే చాలామంది యాపిల్స్ ఎర్రగా నిగనిగలాడుతూ ఉంటే అవి తాజాగా ఉన్నట్టు భావిస్తారు. అయితే ఇలా ఎర్రగా నిగనిగలాడే యాపిల్స్ ఇప్పుడు కొంప ముంచుతున్నాయి. ఇవి ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయని సాక్షాత్తు భారతీయ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతోంది. దీని వెనుక కారణం ఏంటో.. యాపిల్స్ ఎందుకు హానికరంగా మారుతున్నాయో తెలుసుకుంటే..

యాపిల్ తో పొరపాటున కూడా కలిపి తినకూడదని ఆహారాలు ఇవి..!


ఎర్రగా పండిన యాపిల్స్ ను తినాలని అందరూ కోరుకుంటారు. యాపిల్స్ ధర ఎక్కువైనా సరే యాపిల్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాల కారణంగా వీటిని కొనుగోలు చేస్తారు. అయితే మార్కెట్లో ఎర్రగా నిగనిగలాడుతూ ఉన్న యాపిల్స్ అన్నీ సహజంగా పండినవేం కాదు. ఇన్నాళ్లు మామిడి పండ్ల విషయంలో ఎలా జరిగిందో ఇప్పుడూ యాపిల్స్ విషయంలోనూ అదే జరుగుతోంది. పచ్చి యాపిల్స్ ను కాల్షియం కార్బైడ్ తో పండిస్తున్నారు. రసాయనాలతో పండించిన యాపిల్స్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు.. ఇలా రసాయనాలతో పండించిన యాపిల్స్ ను ఎక్కువ కాలం తింటూ ఉంటే మధుమేహం రావడమే కాకుండా శరీరంలో అవయవాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.

ఈ 6 సమస్యలు ఉన్నవారు సొరకాయ పొరపాటున కూడా తినకూడదు..!


యాపిల్ పండించడంలోనే కాకుండా యాపిల్ నిగనిగలాడుతూ కొనుగోలు దారులను ఆకర్షించడానికి యాపిల్స్ ను మైనం పూత పూస్తున్నారు. ఇది కూడా ఆరోగ్యానికి చాలా ప్రమాదం కలిగిస్తుంది. యాపిల్స్ కొనుగోలు చేసేముందు చాలా జాగ్రత్తగా ఉండాలని FSSAI చెబుతోంది. యాపిల్స్ మీద నల్లని మచ్చలు ఉన్నవి కొనుగోలు చేయకూడదట. ఇవి రసాయనాల ద్వారా పండించినవి కావచ్చట. ఇక ఎర్రగా నిగనిగలాడుతూ ఉన్న యాపిల్స్ ను కూడా కొనుగోలు చేయద్దు అంటున్నారు. యాపిల్స్ ను తినే ముందు బాగా రుద్ది కడగాలని అంటున్నారు.

మీ RO ఎంత విద్యుత్ వినియోగిస్తుందో మీకు తెలుసా?

జాగ్రత్త.. ఈ ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వేగంగా పెంచుతాయ్..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 12 , 2024 | 08:14 PM

Advertising
Advertising
<