ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ రెండింటి పోషకాలు ఒకటేనా?

ABN, Publish Date - Sep 29 , 2024 | 08:45 AM

సాధారణంగా డ్రైఫ్రూట్స్‌ అని పిలిచే వాటిల్లోనే బాదం, ఆక్రోట్‌, జీడిపప్పు, పిస్తా లాంటి గింజలను చేరుస్తాం. నిజానికి డ్రైఫ్రూట్స్‌ అంటే కేవలం ఎండబెట్టిన పండ్లు మాత్రమే. ఎండు ద్రాక్ష, ఎండిన అంజీర పండ్లు, ఎండిన ఆల్బక్రా పండు, ఎండు ఖర్జూరం మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.

డ్రైఫ్రూట్స్‌లో ఏవి రోజూ తీసుకోవచ్చు? ఏ సమయాల్లో తీసుకొంటే మంచిది? మొలకెత్తిన గింజలు (స్ర్పౌట్స్‌), డ్రైఫ్రూట్స్‌లోనూ ఒకేలాంటి పోషకాలు ఉంటాయా?

- లత, కృష్ణాపురం

సాధారణంగా డ్రైఫ్రూట్స్‌ అని పిలిచే వాటిల్లోనే బాదం, ఆక్రోట్‌, జీడిపప్పు, పిస్తా లాంటి గింజలను చేరుస్తాం. నిజానికి డ్రైఫ్రూట్స్‌ అంటే కేవలం ఎండబెట్టిన పండ్లు మాత్రమే. ఎండు ద్రాక్ష, ఎండిన అంజీర పండ్లు, ఎండిన ఆల్బక్రా పండు, ఎండు ఖర్జూరం మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి. ఎండిన పండ్లలో నీటి శాతం తక్కువ, చక్కర అధికంగా ఉంటుంది. సాధారణ ఆరోగ్యవంతులు రోజుకు పదీ పదిహేను గ్రాములకు మించకుండా వీటిని తీసుకోవచ్చు. ఇక బాదం, ఆక్రోట్‌, జీడిపప్పు, పిస్తా లాంటి గింజల విషయానికొస్తే, వీటిల్లో కొవ్వు పదార్థాలు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. వీటిలో అధికభాగం అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ గింజల్లో కొంచెం ప్రొటీన్‌, పీచు పదార్థాలు ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, ఐరన్‌, సెలీనియం లాంటి పోషకాలు కూడా ఈ గింజల్లో ఉంటాయి. చాలా పోషకాలున్నప్పటికీ క్యాలరీలు బాగా ఎక్కువ కాబటి,్ట సాధారణ ఆరోగ్యవంతులు వీటిని రోజుకు ముప్ఫయి గ్రాములకు మించి తీసుకోకపోవడం మేలు. ఇక మొలకెత్తిన గింజల్లో కాస్త నీళ్లు, కొద్ది పాటి పిండి పదార్థాలు, మాంసకృత్తులు ఉంటాయి. కానీ కొవ్వులు చాలా తక్కువ, క్యాలరీలు కూడా చాలా తక్కువ. కాబట్టి వీటిని నట్స్‌తో పోల్చడం సరికాదు. ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదు.


ఈ మధ్య సమతులాహారం అని చాలామంది చెప్తున్నారు. అంటే ఏమిటి? డెబ్బై ఏళ్ళు పైబడి, బీపీ, డయాబెటీస్‌ ఉన్నవారు సమతులాహారం అంటే ఏమి తీసుకోవాలి?

- మెట్టు జనార్దనరెడ్డి, వరంగల్‌

సమతుల ఆహారం అంటే మన శరీరానికి అవసరమయ్యే పోషకపదార్థాలను తగు పాళ్ళలో అందించే ఆహారం. సమతులాహారం మనకు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, నీళ్లు మొదలైన పోషకాలను అందించాలి. ఆహారం నుండి వచ్చే పోషకాలు, క్యాలరీలు మన శరీరంలోని అన్ని జీవవ్యవస్థలు సక్రమంగా పని చేయడానికి అవసరం. సగటు వ్యక్తికి రోజూ సుమారు 2 వేల క్యాలరీలు అవసరం, అయితే ఈ మొత్తం వారి వయస్సు, లింగం, శారీరక శ్రమ స్థాయిని బట్టి ఉంటుంది. మగవారికి ఆడవారి కంటే ఎక్కువ క్యాలరీలు అవసరం అవుతాయి. వ్యాయామం చేసేవారికి కూడా ఎక్కువ క్యాలరీలు అవసరమే.


అదే శారీరక శ్రమ తక్కువగా ఉండి ఎక్కువసేపు కూర్చుని ఉండేవారికి క్యాలరీలు, కార్బోహైడ్రేట్ల అవసరం కూడా తక్కువే. ప్రత్యేకించి ఓ పోషకపదార్థం కోసం, అంటే కేవలం ప్రొటీన్‌ కోసం ప్రొటీన్‌ షేక్స్‌ తీసుకోవడం, విటమిన్ల కోసం కేవలం సప్లిమెంట్ల మీద ఆధారపడడం కాకుండా ఈ పోషకాలన్నీ వీలున్నంత వరకు మనం తీసుకునే ఆహారంలో లభ్యమయ్యేలా చూసుకోవాలి. సమతుల్యమైనది కావాలంటే వివిధ రకాల ధాన్యాలు, పప్పులు, గింజలు, కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలపదార్థాలు మన దినసరి ఆహారంలో భాగం కావాలి. డెబ్భైయేళ్లు పైబడి, బీపీ, డయాబెటీస్‌ లాంటివి ఉన్నవారు ఆహారంలో ఉప్పు తగ్గించడం, ప్రొటీన్లు , పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం అవసరం. మీ జీవనశైలికి తగిన ఆహారపు జాగ్రత్తల కోసం నిపుణుల సలహా తీసుకొని పోషకలోపం రాకుండా జాగ్రత్తపడవచ్చు.


ముదురురంగులో కళ్లను ఆకట్టుకునే మల్బర్రీ పండ్లలో ఎలాంటి పోషకాలు ఉంటాయి. అందరూ తినొచ్చా?

- వామనరావు, కరీంనగర్‌

మల్బరీ పండ్లలో దాదాపు 90శాతం నీరు ఉంటుంది. 100 గ్రాముల తాజా పండ్లలో 45 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. విటమిన్‌ సి, విటమిన్‌ కె, విటమిన్‌ ఈ, పొటాషియం, ఐరన్‌ వంటి పోషకాలు ఉంటాయి కూడా. ముదురు రంగుల్లో ఉండే మల్బర్రీల్లో ఆంతోసయానిన్స్‌, సయానిడిన్‌, ర్యుటిన్‌, క్లోరోజెనిక్‌ యాసిడ్‌, మిరిసెటిన్‌ మొదలైన యాంటీఆక్సిడెంట్లు కూడా అధికం. ఈ పండ్లలో ఉండే పోషకాల వలన గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బీపీ, డయాబెటీస్‌ ఉన్నవారు కూడా అవకాశం ఉన్నప్పుడు మల్బరీ పండ్లను తీసుకొంటే మంచిది. పీచుపదార్థాలు ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా ఉంచడంలోనూ మల్బర్రీలు ఉపయోగపడతాయి. పిండిపదార్ధాలు ఉన్నప్పటికీ కూడా పీచుపదార్థంతో కలిసి ఉండడం వల్ల రక్తంలో గ్లూకోజు నియంత్రించేందుకు కూడా ఈ పండ్లు మంచివే. అన్ని వయసులవారూ తీసుకోవచ్చు.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

Updated Date - Sep 29 , 2024 | 08:45 AM