ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Baby Care: చిన్నపిల్లలకు ఆయిల్ మసాజ్ చేస్తున్నారా ఈ నిజాలు తప్పక తెలుసుకోండి..

ABN, Publish Date - Oct 17 , 2024 | 10:45 AM

చిన్న పిల్లలకు నూనెతో ఒళ్లంతా మసాజ్ చేసి స్నానం చేయించడం ఎప్పటినుండో మన పెద్దవాళ్లు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సేఫ్.. దీని వల్ల ఏం జరుగుతుందంటే..

Baby Massage

పిల్లల సంరక్షణ చాలా బాధ్యతతో కూడుకుని ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారికి ఒక వయసు వచ్చేవరకు వారిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు స్నానం చేయించడం అమ్మమ్మలు, బామ్మల పర్యవేక్షణలో లేదా వారి చేతుల మీద జరుగుతూ ఉంటుంది. చాలా కాలం నుంచే చిన్న పిల్లలకు ఒళ్లంతా నూనెతో మసాజ్ చేసి ఆ తరువాత స్నానం చేయించడం జరుగుతోంది. ఇదే పద్దతి మళ్లీ ఈ మద్య కాలంలో బేబీ మసాజ్ పేరిట కొత్త పుంతలు తొక్కుతోంది. పిల్లలకు మసాజ్ చేయడం కోసం కొబ్బరినూనె, ఆలివ్ నూనె, బాదం నూనె లేదా ఆవాల నూనె వంటివి ఉపయోగిస్తుంటారు. అసలు పిల్లలకు మసాజ్ చేయడం ఎంత వరకు మంచిది? పిల్లలకు మసాజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే..

Personality Test: మీ పాదాల వంపు మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట.. ఓసారి చెక్ చేసుకోండి..!


మసాజ్..

  • మసాజ్ అనేది శరీరంలో కండరాలను ఒత్తిడికి గురి చేసే ప్రక్రియ. ఇది శరీరంలో కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఎముకలు, కీళ్లు మొదలైన వాటి ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తుంది. శరీర కణజాల అభివృద్దికి దోహదపడుతుంది. మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే..

  • చిన్న పిల్లలకు మసాజ్ ఎన్నో ఏళ్ల కిందటి నుండి పెద్దలు చేస్తున్న ప్రక్రియనే అయినా.. నేటి కాలంలో వైద్య పరంగాను, పిల్లల సంరక్షణలో భాగంగానూ దీనికి ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా 2021లో జరిగిన పరిశోధనలలో పిల్లలకు మసాజ్ చేయడం వల్ల కింది ప్రయోజనాలు కలుగుతాయని స్పష్టం చేశారు..

  • పిల్లలకు మసాజ్ చేయడం వల్ల కండరాలు, ఎముకలు బలపడతాయి. దీని వల్ల పిల్లలు బలంగా ఉంటారు.

  • మసాజ్ చేస్తే చేతులు, కాళ్లలో పట్టు పెరుగుతుంది. కాళ్లు చేతులు దృఢంగా మారతాయి. కాళ్లు చేతులలోనే కాకుండా శరీరం అంతా రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది.

  • మసాజ్ చేసిన తరువాత పిల్లలకు స్నానం చేయిస్తే హాయిగా నిద్ర పోతారు. ఇది పిల్లలలో నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. పిల్లలలో అలసట, ఒత్తిడి వంటివి తగ్గుతాయి.

  • పిల్లలకు మసాజ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రవాహం, ఆక్సిజన్ ప్రవాహం మెరుగవుతుంది. శ్వాస ఆరోగ్యం బలపడుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

  • గ్యాస్, ఉబ్బరం, కండరాల తిమ్మిరి, మలబద్దకం వంటి సమస్యలు పిల్లలలోనూ ఉంటాయి. పిల్లలకు మసాజ్ చేయడం వల్ల ఇవన్నీ తగ్గుముఖం పడతాయి.


ఇవి పాటించాలి..

  • పిల్లలకు మసాజ్ చేసే ముందు నూనె ఎంపిక విధానం కూడా బాగుండాలి. మందంగా ఉన్న నూనె కాకుండా తేలికగా ఉన్న నూనె ఎంచుకోవాలి. ఇవి పిల్లల సున్నితమైన చర్మానికి మంచివి.

  • పిల్లలు గట్టిగా ఏడుస్తున్నా అలాగే మసాజ్ చేయకూడదు. బలవంతంగా మసాజ్ చేయకూడదు. మసాజ్ సమయంలో పిల్లలు హాయిగా రిలాక్స్ అవ్వాలి. మసాజ్ ను గట్టిగా కాకుండా మెల్లిగా, సున్నితంగా చేయాలి.

  • పిల్లలకు మసాజ్ చేయడానికి ఉపయోగించే నూనెలను గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. మసాజ్ చేసేటప్పుడు పిల్లలతో సంభాషించడం, జోల పాడటం వంటివి చేస్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు.

  • కృత్రిమ నూనెలను ఎప్పుడూ పిల్లల మసాజ్ కోసం ఉపయోగించకూడదు. మసాజ్ చేసిన తరువాత కనీసం గంట నుండి రెండు గంటలు పిల్లల తరువాత పిల్లలకు స్నానం చేయించాలి. పిల్లల చర్మం నూనెను శోషించుకుని చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలకు స్నానం చేయించే నీరు మరీ వేడిగా ఉండకూడదు. గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి..

చపాతీ గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు..!

కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 17 , 2024 | 10:54 AM