ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bed Sheet: పరుపు మీద వాడే బెడ్ షీట్లను ఎన్ని రోజులకు ఉతకాలి? చాలా మందికి తెలియని నిజాలివీ..!

ABN, Publish Date - Oct 04 , 2024 | 03:45 PM

పరుపు మీద బెడ్ షీట్లు, తల దిండుకు వేసే దిండు కవర్లను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి చాలా రకాల జబ్బులకు ఇవే కారణం అవుతాయి.

Bed Sheet

నిద్ర చక్కగా పట్టాలంటే పడక గది వాతావరణం బాగుండటమే కాదు.. పడుకునే పరుపు, పరుపు మీదే వేసే బెడ్ షీట్లు, తల దిండు, దిండు కవర్.. ఇలా ప్రతి ఒక్కటి కీలకపాత్ర పోషిస్తాయి. పరుపు మీద బెడ్ షీట్లు, తల దిండుకు వేసే దిండు కవర్లను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలనే విషయం చాలా మందికి తెలియదు. కొందరు బెడ్ షీట్లను వారానికి ఒకసారి, మరికొందరు 10రోజులకు ఒకసారి, ఇంకొందరు నెల రోజులకు ఒక సారి ఇలా మారుస్తూ ఉంటారు. అయితే బెడ్ షీట్ మార్చడం ఎందుకంత ముఖ్యం? ఎన్ని రోజులకు ఒకసారి మారిస్తే మంచిది? తెలుసుకుంటే..

Food Tips: రోజూ ఆహారంలో సలాడ్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఆహార నిపుణులు ఏం చెప్పారంటే..!


రోజంతా ఇంట్లో బయట ఎన్ని పనులు చేసినా పడుకునే సందర్భం రాగానే పరుపు మీద వాలిపోతుంటారు. పరుపు మీద వేసే బెడ్ షీట్ శుభ్రంగా ఉంటే నిద్ర కూడా చాలా బాగా వస్తుందట. పరిశుభ్రత మీద శ్రద్ద ఉన్నవారు అయితే ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. అయితే చిన్న పిల్లలు ఉన్న తల్లులు, ఇంటి పని మొత్తం చేసుకుంటూ ఉద్యోగం కూడా చేసే ఆడవారికి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యం ఉంటుంది.

బెడ్ షీట్లు ఎందుకు మార్చాలి?

  • బెడ్ షీట్ల కారణంగా చాలా అలర్జీలు వస్తాయి. బ్యాక్టీరియా, దుమ్ము, కొన్ని రకాల పురుగులు, ముఖ్యంగా నల్లులు వంటివి పరుపులో చేరతాయి. బెడ్ షీట్ శుభ్రంగా లేకపోతే పైన చెప్పుకున్న అన్నిటికీ మీరు పడుకునే పరుపులు ఆవాసం అవుతాయి. వీటి మద్య పడుకుంటే అలెర్డీలు, శ్వాసకోశ సమస్యలు వస్తాయి.

  • రాత్రి పడుకున్నప్పుడు చెమట, చర్మ కణాలు, తలకు పెట్టుకున్న నూనె, బయటకు వెళ్లొచ్చినప్పుడు, లేదా కాళ్లు కడుక్కున్న తరువాత కాళ్లు శుభ్రం చేసుకోకుండా పడుకుంటే కాళ్లలోని తేమ బెడ్ షీట్ కు చేరుతుంది. బెడ్ షీట్ ను ఎక్కువ రోజుల పాటూ మార్చకుండా ఉంటే పరుపు కూడా బ్యాక్టీరియాకు నెలవు అవుతుంది.

  • ఉతికిన బెడ్ షీట్లు వాడుతూ ఉంటే పడుకోవడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పైగా చర్మ సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి.

Health Tips: నీళ్లలో పటిక కలుపుకుని స్నానం చేయండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!


ఎన్ని రోజులకు ఉతకాలి..

  • బెడ్ షీట్లను వ్యక్తిగత సమయాన్ని బట్టి ఉతుక్కోవాలి. చిన్న పిల్లలు ఉన్వారు మూడు రోజులకు ఒకసారి బెడ్ షీట్ మారుస్తుంటే మంచిది.

  • చెమట అధింగా పట్టేవారు, అలర్జీ సమస్యలు ఉన్నవారు బెడ్ షీట్ ను కనీసం వారానికి ఒకసారి ఉతకడం మంచిది.

  • రాత్రి పూట చెమట ఎక్కువగా పట్టకుండా ఒంటరిగా నిద్రపోయే వారు రెండు వారాలకు ఒకసారి అయినా బెడ్ షీట్ ఉతకవచ్చట. ఇది మాత్రమే కాకుండా కాళ్లు చేతులు కడుక్కోవడం, రాత్రి నిద్రించే ముందు దుస్తులు మార్చుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకునేవారికి ఇది మంచిది. ఇవి చేయకుండా ఉదయం నుండి రాత్రివరకు ఒకే దుస్తుల్లో ఉంటూ శుభ్రత పాటించని వారు వారానికి ఒకసారి బెడ్ షీట్ మార్చుకోవడం మంచిది.

Hair Care: తెల్ల జుట్టు, జుట్టు రాలడం సమస్యలు మీకూ ఉన్నాయా? యోగా మాస్టర్ చెప్పిన ఈ టిప్స్ ట్రై చేసి చూడండి..!


ఎలా ఉతకాలి..

  • వేడి నీటిలో బెడ్ షీట్లను నానబెట్టి తరువాత ఉతకాలి. వేడి నీటిలో నానబెట్టడం వల్ల దుమ్ము, పురుగులు, బ్యాక్టీరియా వంటివి నశిస్తాయి. అయితే బెడ్ షీట్ ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి.

  • కొన్ని బెడ్ షీట్లు రంగులు పోతాయి. ఇలాంటివి విడిగా వాష్ చేయడం మంచిది.

  • ఉతికిన బెడ్ షీట్లను ఎప్పుడూ ఎండలో ఆరబెట్టాలి. ఒకవేళ బెడ్ షీట్ ఫ్యాబ్రిక్ సున్నితంగా ఉన్నది అయితే లేత ఎండలో ఆరబెట్టాలి.

  • ఉతికిన తరువాత బెడ్ షీట్లను మడత పెట్టి వెచ్చని ప్రదేశంలో, పొడిగా ఉన్న ప్రదేశంలో భద్రపరచాలి.

ఇది కూడా చదవండి..

వెల్లుల్లి నీటిని ప్రతిరోజూ తాగుతుంటే శరీరంలో కలిగే మార్పులు ఇవే..

రోజులో ఎండుద్రాక్ష ఎన్ని తినాలి? ఎన్ని తింటే ఆరోగ్యమంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 04 , 2024 | 03:45 PM